పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యజమానులుగా కొలంబియా ఆయిల్ కంపెనీని స్థాపించారు. కార్నెగీ యిరవై యేళ్ళయినా నిండని తన తమ్ముడు టామ్ కార్నెగీ కోసం కొంతడబ్బును ముందు తానే పెట్టుబడిపెట్టి భాగమిచ్చి కంపెనీలో చేర్చాడు. శక్తి, నిశితమైన బుద్ధివున్న వాళ్ళకు అది నిజంగా అవకాశ స్వర్ణ యుగం. ఆ తరువాత ఎన్నడూ కార్నెగీకి క్రొత్త పెట్టుబడులకు డబ్బు లేక పోవటమంటూ లేదు. అతడు మరిన్ని ఆడమ్స్ ఎక్‌ప్ర్సెస్ వూడ్రవు పెట్టుబడులను కొన్నాడు. వెష్టరన్ యూనియన్ టెలిగ్రాపు సంస్థలోనుంచి కొనట మారంభించాడు. అతని సంపద దొర్లిపొయ్యే మంచుముద్దలా పెద్దదౌతున్న కొద్దీ, దాని చుట్టూ మరికొంత పేరుకొంటున్నది.