పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కునికిపాటయినా చాలు శ్రమతీరి మహోల్లాసంతో నిద్రలేచేవాడు. దీనికి తోడుగా అతనికి హృదయపూర్వకంగా పనిచేయాలన్న గుణ ముంది. క్రొత్తది బాధ్యతాయుత మైంది. ఐన వుద్యోగాన్ని శక్తితో నిర్వహించిచూపించే ఆశయంగల యువకుడు అతడు.

పిట్స్‌బర్గులోని పొగ, పొగదుమ్ము, తిరిగి వచ్చినపుడు వాళ్ళను ఆశ్చర్యచకితులను చేశాయి. "ఇది వెనుకటి కంటె చాలా అసహ్యకరమయినది" అని వాళ్లు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు - కాని నిజానికి ఇప్పుటికంటె వెనకే ఎక్కువ అసహ్యకరంగా వుండే దనికూడా చెప్పవచ్చు. ఏవస్తువునూ పరిశుభ్రంగా వుంచటం సాధ్యంకానిపని అని మార్గెరెట్ కార్నెగీ గృహిణీ హృదయం నిరుత్సాహంతో తల్లడిల్లింది.

కార్యాలయంలో ఒకనాడు "మాకు గ్రామ సీమలో వుండాలని వుం" దన్నాడు.

"మంచిది. ఎందుకుండ కూడదు" అన్నాడు మిష్టర్ స్కాట్ మేనల్లుడు. రైల్‌రోడ్ సంస్థకు జనరల్ ప్రయిట్ ఏజంటు డి. ఎ. స్టువార్టు. "హోమ్‌వుడ్‌కు వచ్చెయ్యండి వెంటనే కొనవచ్చు మాకు ప్రక్కనే ఒక స్థల ముంది. దాని వునికి ఎంతో బాగుంది. ఏమంతదూరానకూడా లేదు. ఆ పరిసరాలల్లో ఒక డజనుకుమించి కుటుంబాలు లేవు. అవి అన్నీ వున్నతస్థాయిలోవే. మీరు కావాలంటే వచ్చి చూచేటంత