పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/90

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రపు చలికాలంలో చాలా అవకాశాలు లభించాయి. ప్రమాదం సంభవించినప్పుడు డివిషన్ సూపరింటెండెంటు రాత్రింబవళ్ళూ పనిచేయాలని ఉద్దేశింపబడుతుంది. రాత్రివేళ ఏదైనా ఒక హఠాత్సంభవము జరిగితే అతనికి ఆ రాత్రికి రాత్రే తెలియజేస్తుండేవారు. ఆ ప్రదేశానికివెళ్ళి అతడు దాన్ని చక్కబెట్టి వస్తుండేవాడు.

అంతే కాదు. అది ఎంత గడ్డుచలికాలం ! ఆ రోజుల్లో పట్టాలను అడ్డుకమ్మీలమీద బిగించేటప్పుడు పట్టుపట్టటం కోసం పోతయినుము "ఛైర్స్" ఉపయోగించేవాళ్లు. గట్టిచలిగాలికి అవి తట్టుకోలేక పగుళ్లు చూపి విచ్చిపోతుండేవి. బండ్లు ఆగిపోవటాలు, పట్టాలుతప్పటాలు ఆ చలికాలంలో సరంపరగా ఉంటుండేది. ఒక చిక్కని చలిరాత్రి. ఎక్కడో ఒక చోట, ఇక్కడో అక్కడో, ఆ ఛైర్లు నలభైయేడింటిదాకా బ్రద్ధలైనాయి. అలా చలి విజృంభించే ఆ రోజుల్లో క్రొత్త సూపరింటెండెంటు ఇల్లువిడచి ఎనిమిది దినాలపాటు తిరిగి భంగాలు కలిగినచోట్ల, బండ్లు పట్టాలు తప్పినచోట్లు చూచాడు.

తనకు అలుపు లేదు కనుక తాను ఇతరుల కష్టసుఖాలను ఎరగని కఠినుడైన అధికారివలె ఆ రోజుల్లో ప్రవర్తించానేమో అన్నభావం అతనికి తరువాత కాలంలో కలిగింది. తనచుట్టూ ఎంతోరొద వున్నా లెక్కచెయ్యకుండా బాక్స్‌కార్ నేలమీద గాని లేదా మరెక్కడయినా గాని వెన్నువాల్చి వెంటనే నిద్రపోగలశక్తి అతనికుంది. ఎంత చిన్న