పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/89

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వారి పిట్స్‌బర్గు డివిషన్ సూపరింటెండెంటు గౌరవానికి భంగకరమైన పనై పోయింది. అతని తల్లి ఈ వార్తవిని సంక్షేపంగా సంతోషించింది. ఆండ్రూవంటి కుర్రవాడివల్ల ఆశించేది ఇటువంటివి కావటమే ఇందుకు కారణం. ఆమె తిరిగి పిట్స్‌బర్గుకు వెళ్ళటమనే సమస్యను ఎదుర్కోవలసి వచ్చింది. ఆమె "పూర్వ మిత్రుల మధ్యకు, బంధువుల మధ్యకు వెళ్ళటమంటే సంతోషకరమైన విషయమే గాని అక్కడి పొగమసికి భయమేస్తున్న" దన్నది.

పదహా రేళ్ళ వయసుగల టామ్‌తో అన్నాడు: నాకు కార్యదర్శివిగా వుండటం నీ కిష్టమేనా?"

"ఎంతో బాగుం" దని ఆశ్చర్యాన్ని వెలిబుచ్చాడు టామ్. అతడు ఇప్పుడు అద్భుతమైన టెలిగ్రాఫ్ రైనాడు. డివిషన్ సూపరింటెండెంటుకు తంతిద్వారా అనేకమైన వార్తలను పంపించటం, అందుకోవటం వుంటుంది.

సూపరింటెండెంటు బల్లమీద కూర్చుని ఉత్తరువు లిచ్చేటప్పుడు ఆండ్రీ 'అబ్బా!' అని అనిపించుకోకుండా వుండటానికి యత్నించాడు. ఉన్నతస్థాయి వుద్యోగానికి అమాంతంగా ప్రాకి పై కొచ్చిన చిన్నవాడయిన తన్నుగురించి వయోవృద్ధులైన ఇత రోద్యోగస్థులు తమలో తాము గుసగుసలాడుకుంటారని అతడు అనుమానించాడు. అందువల్ల తన చిన్న రూపం సంగతి ఎలా వున్నా, తాను పొందిన ఆ వుద్యోగస్థానానికి తాను తగ్గవాడనని నిరూపించటంకోసం అతడు మరింత నిశ్చయం చేసుకోవటం జరిగింది. తన గుణవిశేషాలను నిరూపించుకోటానికి అతనికి ఆ సంవత్స