పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"సరే, మంచిది. నీ కొక అవకాశమిచ్చి చూడటానికి పుష్టర్ థామ్సన్ అంగీకరించాడు." జీత మెంతకావాలని నీ అభిప్రాయం!"

"జీతమా!" అని ఆశ్చర్యపడ్డట్లున్నాడు, ఆ క్రొత్త సూపరింటెండెంటు జీతంసంగతి అతని మనసులో ప్రవేశించనే లేదు. "నేను ఆసక్తిపడేది జీతాన్నిగురించికా"దన్నాడు ఉదారంగా. "నేను కోరేది ఆ పదవి. మీరు వుండి పూర్వం పనిచేసిన ఆ స్థానాన్ని పొందటమే నాకు గొప్ప. అదిచాలు. జీతాన్ని మీ ఇష్టంవచ్చినట్లుగా నిర్ణయించండి. మీ కిష్టమయితే ఇప్పుడిస్తున్న దే ఇవ్వండి.

[అది నెలకు అరవై అయిదు డాలర్లు]

మిష్టర్ స్కాట్ అతని సాధుత్వాన్ని గమనించి వస్తున్న నవ్వును ఆపుకొన్నాడు. "ఆ వుద్యోగాన్ని నేను నిర్వహిస్తున్నప్పుడు సంవత్సరానికి పదిహేనువందలు పుచ్చుకొన్నాను. మిష్టర్ పాట్‌కు పద్దెనిమిదివందలు వస్తున్నాయి. నిన్ను పదిహేనువందలమీద నియమించటం ఉచితం. నీ వీ తొలి పరీక్షలో విజయవంతుడవయితె జీతం పద్దెనిమిదివందల దాకా పెరుగుతుంది. అది నీకు సంతృప్తికరమేనా?"

ఒక్క మాట తలనూచి చేతిని ఆడించటంతో అది అతనికి అప్రధాన విషయమని ఆ క్రొత్త వున్నతోద్యోగి తెలియ జేశాడు.

తన కబ్బిన శుభాన్ని గురించి తెలియజేసే ఆతురతో అతడు మరోమారు వేగంగా ఇంటికి చేరాడు. అస లతడు లగెత్తి వెళ్ళ దలచాడు. కానీ అది పెన్సిల్వేనియా రైల్‌రోడ్