పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గలుగుతుండేవాడు. పెన్సిల్వేనియా సంస్థ ఇంకా ఇతర జాతి --పర్లను నిర్మిస్తున్నది. ఈ పనికి ఇతర కంపెనీలు, తామూ పూనుకొన్నవి. అతడికి ఇరవయ్యయిదేళ్ళ వయసు వచ్చేటప్పటికి స్లీపింగ్ కార్ల పెట్టుబడిమీద వస్తున్న సంవత్స రాదాయం 5000 డాలర్లు. "సాంకోపాంజా పలికిన ధోరణిలో అంటున్నాను. నిద్రను కని పెట్టినవా డెవడోగాని అతడికి శ్రేయమగు గాక!" అన్నాడు అత డోమాటు.

కార్నెగీలు అల్తునాలో మూడేలున్న తరువాత 1859 నాటి గ్రీష్మంలో, మిస్టర్ స్కాట్ తన అసిస్టెంటుతో అన్నాడు: "ఆండ్రీ! వాళ్లు నన్ను ఫిలడల్ఫియా సంస్థకు ఉపాధ్యక్షుణ్ని చేయదలచుకొన్నారు. ఈవిషయాన్ని మిస్టర్ థామస్‌తో చర్చించేటందుకు నేను వచ్చేవారంలో ఫిలడల్పియాకు వెళ్లుతున్నాను."

ఈ వార్త విని ఆండ్రూ క్రుంగిపోయాడు. ఫిలడల్ఫియా, అతడు విశేషంగా గౌరవిస్తూ , దరిదాపు అతని కాదర్శమూర్తి అని భావించే పెద్దను ఆకర్షించి వేస్తున్నది. దీని పలితం అతని మీద ఎలా వుంటుంది? స్కాట్‌కు అనుబంధంగా వుండటం తప్ప ఇంతవరకూ అతని కొక విశిష్టత అంటూ ఏమీ లేదు. తన అధికారి తనకోసం ఫిలడల్ఫియాలోనే ఏదయినా ఉద్యోగ మిప్పిస్తాడా? అలాగే జరుగుతుందని అతడు తీవ్రోద్వేగంతో ఆశించాడు. మరొకరి క్రింద పని చేయటమన్న భావం కలిగినప్పుడు అమితంగా భయపడ్డాను.

మేనేజరు ప్రయాణంచేసి తిరిగి వచ్చాడు. ఆండీని తన కార్యాలయానికి రమ్మని పిలిచాడు.