పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సారిగా చెల్లించవలసిన మొత్తం 217.50 డాలర్ళు అప్పు పుచ్చుకోవటంవల్ల తప్ప మరొక విధంగా దీన్ని పొందే అవకాశం ఆండ్రికి లేదు. అతడు మిస్టర్ లాయిడ్ అనే స్థానికుడై వడ్డీ వ్యాపారస్థుడి దగ్గరికి వెళ్లాడు. పెట్టుబడి పెట్టే నిమిత్తంగా డబ్బును అప్పుగా ఇవ్వటానికి అతనికి అవకాశం ఉంటుందేమో అని అడిగాడు. అతడు చాలా పొడగిరి. ఆరు అడుగుల మనిషి. సాయిలా సాయిలావాడు. ఆండ్రీని యెరుగును. అతడంటే ప్రీతి కూడాను.

"అది మంచి పెట్టుబడి అని నీకు నిశ్చయంగా తెలుసునా!" బరువైన తన హస్తాన్ని ఆ యువ మిత్రుని భుజాలమీద అడ్డంగా వుంచి ఆ వడ్డీ వ్యాపారి ప్రశ్నించాడు.

"తెలుసును, అది స్లీపింగ్ కార్ కంపెనీకిపెట్టుబడి. మా రైల్‌రోడ్ సంస్థ రాయలటీ పద్ధతిమీద అటువంటి కార్లను రెంటిని నిర్మించబోతున్నది.

"తప్పక నీ కిప్పిస్తాను, ఆండీ!" అన్నాడు మిస్టర్ లాయిడ్.

"సాహసించి ఐనా ఇవ్వదగ్గవాడివి నీవు."

ఆండ్రూ తన జీవితంలో ఒకప్రామిసరీనోటు వ్రాసీవ్వడం ఇదే మొదటిసారి. ఈ సంఘటనే తన అదృష్టానికి ఆరంభమని తరువాత కాలంలో అతడు నిత్యం భావిస్తుండేవాడు. ధఫాలువారిగా అతడు చెల్లించవలసిన పెట్టుబడి మొత్తాలను అతడికి వచ్చే డివిడెండ్ల మూలంగా వచ్చే డబ్బుతో చెల్లించ