పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/84

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


"మీ కంపెనీ ఈ కార్లను తయారుచేసి, ప్రవేశపెట్టి నాకు రాయలటీ ఇవ్వాలని" అన్నాడు ఆ వస్తుసృష్ట.

దానికి సంబంధించిన వివరాలను చర్చించటం అయిపోయింది. వెంటనే రెండు కార్లను నిర్మించాలని మిస్టర్ స్కాట్ నిశ్చయించాడు. మిస్టర్ వూడ్రఫ్‌తో బాటు ఆండ్రీ బయటికి వచ్చాడు. కార్యాలయ బహిరంగణంలో ఆ వస్తుసృష్ట అతనివంకకు తిరిగి "మిస్టర్ కార్నెగీ, ఈ వ్యాపారంలో నీవు నాతో కలిసి వస్తావా!" అని అడిగినప్పుడు అత డాశ్చర్య పడ్డాడు.

క్షణకాలం ఆండీ మూకత వహించాడు. అతని దగ్గిర ఉన్న దేమిటి? కొద్ది డబ్బు కాదు సిద్థంగా లేకపోవటం. అయితే ఆడమ్స్ ఎక్స్‌ప్రెస్ స్టాక్ లాగా తనవంకకు డివిడెండ్లను ప్రవహింపజేసే అవకాశాలల్లో ఒకటి సిద్ధంగా వుంది. జారవిడవటానికి వీల్లేదు.

"బహుశ:, కలిసి వస్తాను" అన్నాడు. "నీ అభిప్రాయ మేమిటి!" అని అడిగాడు.

"నేను వెంటనే ఆరంభింపబోతున్న సంస్థలో ఎనిమిదోవంతు భాగాన్ని నీకు కొనుక్కొని ఇద్దామని ఉద్దేశిస్తున్నా"

అతడు పెట్టుబడి మొత్తం ఎంతెంతుందో అంకెల్లో చెప్పాడు. వెంటనే చెల్లించటానికి తన దగ్గిర డబ్బు లేదని ఆండ్రీ ఒప్పుకున్నాడు. కొంత సంభాషణ సాగిన తరువాత వూడ్రఫ్ అది అంచెలవారీగా చెల్లిమవచ్చునన్నాడు.మొదటి