పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/82

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పడుకొనేందుకు ఉపయోగించనప్పుడు దీనిని పరుపు, ప్రక్కగుడ్డలను పెట్టుకోటానికి గిడ్డంగిగా వినియోగించుకోవచ్చు. సంగ్రహంగా చెప్పవలసివస్తే ఇది 18 0 నుంచి ఈనాటివరకూ మనకు తెలిసివున్న పుల్మన్ స్లీపింగ్ కార్.

స్లీపింగ్ కార్లని పిలువబడే ఇటువంటివి రైల్‌రోడ్లు మీద ఇప్పటికి దరిదాపుగా ఇరవై సంవత్సరాలనుంచీ వుంటూనే వున్నవి. అయితే ఆత్మగౌరవ మున్నవాళ్లు అందుమీద నిద్రపోవటానికి అసహ్యించుకొన్నారు. స్త్రీలు ఆ పని ఎన్నడూ చెయ్య లేదు. ఇవి ఇరువైపులా రెండుమూడు అంతస్థులున్న బాక్స్ కార్లకంటే కొంచెం బాగున్నవి. కొందరు ప్రయాణీకులు వాటిమీద గుడ్డలు పరుచుకొని, మరి కొందరు బూట్లు విప్పుకొని ఈ షెల్ఫ్‌లమీద వెన్ను వాల్చేవారు..

ఈ సూచింపబడ్డ వూడ్రఫ్ కారు ఎంతో భిన్నమైంది. నమూనాను పరిశీలించగానే ఆండ్రూకు ఉద్రేకం ఎక్కువైంది. ప్రయాణరీతినే పూర్తిగా మార్చివేయగల దేదో యిందులో ఉందని అతడు తనలో తాననుకున్నాడు. ఎన్నో ప్రశ్నలడిగాడు.

వూడ్రఫ్ అన్నాడు: "ఇది మీతో చెప్పటం ఎంతో సముచితం. చాలా అననుకూలమైన పరిస్థితి లైనప్పటికీ న్యూయార్క్ సెంట్రల్ వారు నా భావానికి రూపకల్పన చేసే ప్రయత్నం అర్థహృదయంతోనే చేశారు. దానికి సక్రమమైన అవకాశం లభించ లేదు."