పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిన్న తమ్ముడు హెన్రీ ఆండ్రీకి ఎంతో ప్రీతిపాత్రుడై అతని బహు వ్యాపారాలల్లో భాగస్థుడైనాడు.

బండి యెక్కి ఓహైయోగుండా క్రిష్ణలైనుకు వెళ్ళుతున్నప్పుడు ఆండీ పచ్చని సంచీని మోసుకుపోతున్న ఒక మనిషిని చూశాడు. బండగా కనిపించే అతడు అన్నాడు. మీరు పెన్సిల్వేనియా రైల్‌రోడ్‌కు సంబంధించిన వారట, బ్రేహ్‌మాన్ నాతో చెప్పాడు."

"అవును. నిజమే!" అని సమాధాన మిచ్చాడు ఆండీ.

ఆ అపరిచితుడు "నాపేరు థియొడోర్ పూడ్రఫ్ నా దగ్గిర రాత్రి ప్రయాణాలకు పనికి వచ్చే ఒక కారునమూనా వుంది. దాన్ని నేనే కనిపెట్టాను. మీకు చూపించనా!" అన్నాడు.

"తప్పకుండా"

మిష్టర్ వూడ్రఫ్ తన నమూనాను సంచిలోనుంచి బయటికి తీశాడు. అది నిద్రపోవటానికి వీలైన ఒక కారుభాగం. రెండు వైపులా దానికి జంటలుగా కూర్చోటానికి సీట్లు వున్నాయి. ఈ సీట్లు ఒక దాని కొకటి ఎదురు మళ్ళుగా వున్నవి. రాత్రివేళ రెంటిని కలిపే ఎటుబడితే అటు వంచడానికి అనువైన దిండు, పరుపుల మూలంగా మొత్తాన్ని ఒక శయ్యగా మార్పి వేయవచ్చు. కిటికీపైన మరొకప్రక్కగా వుంది. పగటివేళదీన్ని తెలివిగా లోపలదాచి పెట్టే ఏర్పాటువుంది. గొలుసుల ఆధారంతో రాత్రిళ్లు దీనీక్రిందికి దించవచ్చ్చు.