పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దొర్లిపొయ్యే మంచుముద్ద

5

రైల్‌రోడ్ కంపెనీ మీదికి అభియోగ మొకటి తీసుకొరాబడింది. సమన్లు పంపించి యిందులో సాక్ష్యం చెప్పటంకోసం ఆండ్రూను పిలిపిస్తారని మిష్టర్ స్టోల్స్ అనుమానించాడు. అందుకు సిద్ధపడటం కోసం కొంత కాలవ్యవధి అతడు విచారణకు వాయిదా కోరాడు. అతని యువుకుడైన అసిస్టెంటును కొంతకాలంపాటు రాష్ట్రం బయటికి ఎక్కడికైనా తరిమి వెయ్యమని మిష్టర్ స్టోర్స్ మేనేజర్ స్కాట్‌ను అర్ధించాడు. ఈ కారణంగా ఆండ్రూ క్రిష్టలైను ఓహైయోలకు వెళ్ళి టామ్ మిల్లర్, జిమ్మీ విల్సన్లతో [వీళ్ళిద్దరూ అక్కడ రైల్ రోడ్ లో పనిచేసేవాళ్ళు] చాలా రోజులు గడిపాడు. వారందరూ కొద్దికాలం క్రితమే గుర్రంమీది నుంచి పడటంవల్ల మరణించిన జాన్‌ఫిప్స్ కోసం దు:ఖించారు. యిది ఆ యువకబృందానికి కలిగిన మొదటి విచ్ఛిత్తి. ఈ మహాఘోరమైన ప్రమాదాన్నిస్వీకరించటానికి వాళ్ళు ఏమాత్రం సంసిద్ధులైన వాళ్లుకాదు. జాన్