పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రించవలసిన సమయం వచ్చింది. కొద్ది దినాలల్లో నీవు బండిలో సంచరించబోతున్నావు. ఈ మధ్యకాలంలో నీకు సహాయం చేస్తుంది. ఆ పిల్లని యింట్లోకి రానీ. ఇలా చెయ్యటం టామ్‌కు, నాకు ఎంతో ఇష్టం!

చాలా సేపు గొణిగినా చివరకు ఒప్పుకున్నది. సేవకురాలు వచ్చిన తరువాత ఆమె అల్తూనాలో లభ్యమయినంత ఉన్నత సంఘంలోకి వెళ్ళింది. ఆమె స్వయంగా విద్య నేర్చుకొన్నది. సుళువు బలువులను ఎరిగి వుండటంవల్ల సమత సంపాదించుకున్నది. ఎటువంటి పరిస్థితులయినా చక్కదిద్దుకో గల సౌజన్యం ఆమెకున్నది. ఉద్యానకృషి, పుష్పాలతో ఆమె తన జీవితాని కబ్బిన నూతన దశను అనుభవించుట మారంభించింది.

కొద్ది కాలం క్రితం భార్య చనిపోవటంవల్ల మిస్టర్ స్కాట్ తన గృహ పర్యవేక్షణకోసం తన మేనగోడలు మిస్ రెబెక్కా స్టీవార్డును తీసుకువచ్చాడు. ఆమె సొగసైన యువతి. ఆండ్రూ కంటే వయసున కొన్ని యేళ్లు పెద్దది. అతడికి అవసరమయిన కొన్ని సాంఘి కాచారాలను గురించి నెమ్మది నెమ్మదిగా కొన్ని సలహాలిస్తూ ఆమె ఆండ్రూకు జ్యేష్ఠభగినీ పాత్రను వహిస్తున్నది. కొండలమధ్య యెంతో దూరం వాళ్ళు వాహ్యాళికి వెళ్లుతుండేవాళ్లు. అప్పుడప్పుడు ఆమె ఆండ్రూను మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి ఆహ్వానిస్తుండేది. అటువంటి ఒక సందర్భంలో రైల్‌రోడ్డు వ్యక్తిగా పైకి వస్తున్న టాయ్ మిల్లర్ కూడా అతిథి కావటం తటస్థిం