పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెళ్లాడు. అల్తూనాలో సుఖమైన ఒక కాటేజిని అద్దెకు తీసుకోగల పరిస్థితి ఏర్పడగానే మిసెస్ కార్నెగీ చెప్పులు కుట్టటాన్ని మళ్ళీ మానివేసింది. ఆండ్రూ ఆమెకు ఒక పరిచారిక అవసరమని నిర్ణయించాడు.

"నీవు జీవితమంతా చాలా శ్రమపడ్డావు. యిప్పుడు సుఖపడటం కొత్తగా ప్రారంభించాలి" అన్నాడు ఆండ్రూ తల్లితో.

ఇందువల్ల అతడు ఊహించనంతటి ప్రేలుడు ధ్వని వినిపించింది. ఆమె ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ అన్నది:

"ఏమిటి? నా యింట్లో మరొక క్రొత్తమనిషి ప్రవేశించి అన్ని వ్యవహారాలల్లో స్వేచ్ఛగా సంచరించటమా? అందుకు నేను అంగీకరించను. ఇన్నాళ్లుగా నా పిల్లలకోసం నేనే ఇల్లు దిద్దుకున్నాను. మీకోసం వంట చేశాను. మీదుస్తులను ఉతికి బాగుచేశాను. నీవు ఇప్పుడు నన్ను చేతులు ముడుచుకొని కూర్చోమంటున్నావు. నీవు నన్ను షెల్ఫ్‌లో పెట్టదలిచావు. మరొక స్త్రీని నేను సహించ లేను. బాలురైన మీకు ఇష్టమైన ఆహారపదార్థాలను ఎలా వండాలో ఇతర స్త్రీ ఎవతెకూ తెలియదు.

ప్రక్కవాటుగా వచ్చిన మాటను పుచ్చుకొని ఆండీ "అమ్మా! నీవు నాకు, టామ్‌కు సమస్తం చేశావు. నీవే సమస్తమైనావు. మరి, మమ్మల్ని నీకోసంకొంత చెయ్యనీ. మనం భాగస్వాములమై ఒకరి కొకరం ఎవరి కేది మంచిదో అది చేద్దాం. నీవు విందుల్లో యజమాను రాలివై వ్యవహ