పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/76

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


"ఎవడు హేతువాదం చెయ్యడో వాడు బుద్ధిహీనుడు

ఎవడు చేయటానికి ఇష్టపడడో వాడు దురభిమాని;

ఎవడు చేయటానికి సాహసించడో వాడు బానిస"

అన్న లేఖనం కనిపించింది. ఆండ్రూ ఆ అందమైన నిర్మా కాన్ని నివ్వెరపడి చూస్తుండగా సూటిగా చెప్ప బడ్డ పైవాక్యాల ప్రభావంవల్ల అతని ఆత్మసంచలించింది. అతడు తనతో తాను చెప్పుకున్నాడు. "ఎప్పుడో ఒకప్పుడు నా గ్రంథాలయాన్ని నేను ఏర్పాటుచేసుకొంటాను. అందులోని గూట్లో ఈ మాటలనే చెక్కిస్తానూ." కొంతకాలం గడచిన తరువాత వాటిని న్యూయార్క్ స్కాట్లండ్లలో కార్నెగీ గృహాలల్లో రెండు గూళ్ళల్లో చెక్కించటం జరిగింది.

అతడు ఇప్పుడు అధికాధికంగా అతథిగా ఆహ్వానింపబడుతున్నాడు. అందువల్ల అత్యవసరమైన ఆనాటి క్రమమైన సాంఘికాచారాల గురించిన పాఠాలను ప్రత్యక్షంగా నేర్చుకుంటున్నాడు. జనరల్ ఫ్రయిట్ మేనేజరు భార్య మిసెస్ ఫ్రాన్సిస్‌స్ అతని యెడ ఎంతో వాత్సల్యాన్ని ప్రదర్శిస్తుండేది. అతడు సిగ్గరి కావటంవల్ల ఆమెకు తమ యింట్లో భోజనము చెయ్యమని బలవంతం చేయటానికి బహుకాలము పట్టింది.

లొంబొయర్టు తరువాత 1856 లో మిష్టర్ స్కాట్ జనరల్ సూపరింటెండెంటు పదవిని స్వీకరించి తన కార్యాలయాన్ని అల్తూనాకు మారుస్తూ ఆండ్రూను తన వెంట తీసుకు