పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/75

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యువకుడుగా ఉన్నప్పుడు ఆండ్రూకు పత్రికా రచన మీద ఎన్నో ఆశలుండేవి. ముఖ్యంగా సంపాదకుడుగా పనిచేయటంమీద అతని ప్రీతి తరువాత కొద్ది సంవత్సరాలకు ఇతడు 'న్యూయార్క్ ట్రిబ్యాన్‌' పత్రికకు ఒక ప్రజాహిత విషయంమీద లేఖవ్రాశాడు. పెన్సిల్వేనియా రైల్‌రోడ్ విషయంలో నగరపౌరులు ఎంతటి అనాతథేయ ప్రవర్తనను ప్రకటిస్తున్నారో వివరిస్తూ యిప్పుడితడు 'పిట్స్‌బర్గ్ డిస్పాచ్‌' పత్రికకి ఒక లేఖ వ్రాశాడు. ఈ వుత్తరం 'నామరహితంగా' ప్రచురితమైంది. కాని, రైల్ రోడ్ కంపెనీకి ముఖ్య సంహాదారైన మిష్టర్ స్టోల్స్ లేఖకుని పేరు చెప్పవలసిందని గట్టిగా కోరాడు. దీని ఫలితంగా రచయితను అతడు గ్రీన్స్‌భర్గలోని తన యింటికి వారాంతంలో సెలవుదినం గడపటానికి రమ్మని ఆహ్వానించాడు, మిష్టర్ స్టోల్స్ వంటి తేజోవంతుడు, విద్యా వేత్తతో తృప్తికరంగానే నేం మాట్లాడగలను, వుల్లాసకరంగా ఏం చెయ్యగలనని సంశయిస్తూనే ఆహ్వానాన్ని అందుకున్నాడు ఆండ్రూ. కానీ అతడు తాను సంశయించిన విషయంలో పొరబడ్డాడు.

ఇక్కడే అతడు తనకు పరిచితముగాని ఇంట్లో ఒకరికి తా నతిధియైన మొదటిరాత్రి గడిపాడు. స్టోల్స్ నివేశనాతిశయంవల్ల అతడు ఎంతగానో ప్రభావితు డయినాడు. ముఖ్యంగా ఆ గృహంలోని గ్రంథాలయంలో వున్న ఒక పాలరాతిగూడు అతణ్ని ఆకర్షించింది. ఆ అర్ధచంద్రాకృతిగల గూట్లో మధ్యన ఒక తెరిచిన పుస్తకానికి ప్రతికృతి అమర్చబడివుంది. దానిమీద-