పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంవత్సరాల వరకూ వాళ్ళు అలా చేస్తూ వచ్చారు.

ఫిప్స్ పాదరక్షా కార్యాలయంలో అతడికోసం వచ్చిన వాళ్ళందరు తిరిగి వెళ్ళిపోయిన తరువాత సాయం సమయాలల్లో ఈ 'పంచకం' వర్తమాన సమస్యలను గురించి నిత్యం ఉల్లాసకరమైన చర్చలు సాగిస్తుండే వాళ్ళు. ఆండీ విశేషంగా శ్రామికజనతత్వం కలవాడు. ప్రతిసమస్యను ప్రజల్లోకి తీసుకోపోవాలని వుల్లాసపడుతుంటాడు. ఒకప్పుడితడు గంటన్నరకు తక్కువగాని గంభీరోపన్యాసం చేశాడు. తరువాత మిల్లర్ న్యాయాధి పతులను 'జనవాక్యాన్ని' అనుసరించి నిర్దేశించాలని వాదించాడు. అయితే ఇది ఆచరణ యోగ్యమైనది, కాదని అతడు తరువాత కాలంలో గుర్తించాడు. యింతలో ఒక వార్తాహారి ఊపిరిసలుపుకోలేకుండా వచ్చి "కార్నెగీ నిన్ను రమ్మంటున్నారు. డేర్రీదగ్గిర ఒక 'విచ్ఛితి' జరిగిందట" అని చెప్పకపోయి నట్లయితే అతడు ఇంకా ఆవిషయాన్ని గురించి ఎంతసేపు మాట్లాడి ఉండేవాడో చెప్పటం కష్టం-పిలుపును గురించి విన్న వెంటనే హాట్, కోటు అందుకొని "మీలో ఎవరైనా నేను ఎక్కడికి వెళ్లుతున్నానో మా యింట్లో తెలియజేయండి" అని చెప్పి పరుగు పెడుతూ అదృశ్యుడైనాడు.

అవసరం వచ్చినప్పుడు ఆ అయిదుగురు వెబ్ట్సర్ సాహిత్య సంఘం సభ్యులుగా చేరారు. ఇది నగరంలోని ఈ జాతిక్లబ్ లన్నింటిలో శ్రేష్ఠమైంది. ఇందులోని సభ్యత్వానికి యోగ్యులుగా పరిగణింపబడినవారు ఎంతో గర్విస్తారు.