పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/63

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కవి కావ్యసంపుటాన్ని అతనికి బహూకరించాడు. మరొకటి ఏదయినా అతనికి ఎక్కువ సంతోషాన్ని కలిగించేది కాదు.

ప్రాచ్యవై దేశిక వార్తలను తీసుకురావటం కోసం ఫిట్స్‌బర్గులోని వార్తాపత్రికలు విడివిడిగా తమ విలేఖకులను తంతి వార్తాకార్యాలయానికి పంపిస్తుండేవి. ఇప్పుడు అవి అన్నీ కలిసి ఏకంగా ఒక విలేఖకుని మా త్రమే పంపటానికి నిర్ణయించుకొన్నవి. ఆ విలేఖకుని సూచన మీద ఆండీ వార్తలకు అయిదుప్రతులను తయారు చేసి ఇస్తుండేవాడు. ఈ పని చేసినందుకు అతనికి వారాని కొకడాలరు వస్తుండేది. అంతాచేరి ఇప్పుడు అతనికి నెలఒకటికి దరిదాపుగా ముప్పది డాలర్ల రాబడి అయింది.

కార్నెగీ కుటుంబం అద్దె యివ్వటం మానివేసి స్వంత యిల్లు కొనుక్కొనేందుకు తగ్గ ఆర్థికస్తోమతు తమకు లభించినట్లు భావిస్తున్నది. రెండు సంవత్సరాలల్లో తీర్చేటట్లు అంకుల్ ఆండ్రీ హోగన్ కాటేజి, రెబెక్కా వీధిలో వొక నివేశన స్థలం వాళ్ళు 50 డాలర్లకు కొనుకు న్నారు.

వసంత సమయంలో ఓహైయోనది పొంగి స్టుయిబెన్ విల్లీ ల్హీలింగుల మధ్య తూర్పుకు మధ్య పశ్చిమానికి మధ్య వార్తా తంత్రులను త్రెంచివేసి, ఇరవైమైళ్ళ పొడుగు తంతి తీగను దూరంగా కొట్టిపారేసిన నాటికి ఆండీ వయస్సు పదిహేడున్నర సంవత్సరాలు. తీగలను తిరిగి ముడిపెట్టేటంత వరకూ స్టేషన్లమధ్య సంబంధాన్ని నిలవబెట్టటం కోసం ఆండ్రీని స్టుయిబెన్ విల్లీకి పంపించారు. తూర్పునుంచి వార్త