పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆండీ ఈ వార్తను తీసుకువచ్చినప్పుడు ఇంట్లో ఆనందోద్వేగం అతిశయించింది. తల్లి వెంటనే ఆతని దుస్తుల విషయం ఆలోచించింది. తల్లి "అతనికి క్రొత్తషర్టుకావా" లన్నది, తండ్రి ఈ సంఘటనకు నివ్వెరపోయాడు.

"బాధ్యత ఎంతో తెలిసిందా !" అన్నాడు కేక పెట్టినట్లు. "నవంబరు వస్తేగాని అతడికి పదిహేడేళ్ళు రావు. ఆండీ ! ఈ పనిని నిర్వహించగల శక్తి నీ కున్నట్లు భావిస్తున్నావా ?"

"అవును. నిర్వహింపగలననే భావిస్తున్నాను!" అని ఆత్మవిశ్వాసపూర్వకమైన సమాధానం వచ్చింది.

"నీవు యోగ్యుడ వనిపించుకొనటానికి ఇది తగిన గౌరవమని నా నమ్మకం!" అన్నాడు తండ్రి.

స్టేజికోచ్ మీద ముప్ఫదిమైళ్లు ప్రయాణం చెయ్యటమనేది ఎప్పుడోగాని తటస్థపడని పండుగ. ప్రధానంగా ఫిలడల్ఫియానుంచి ఫిట్స్‌బర్గువరకూ తన రైలుమార్గాన్ని విస్తృతం చేస్తున్న రైలురోడ్డు వారికోసం దారిపొడుగునా లోతుగా గుంటలు తీసి కట్టలు పోసేందుకు మూగుతున్న నిరంతర శ్రామిక జనదర్శన నయనోత్సవం అతనికి కలిగింది. అనతి కాలంలోనే ఆ సాహసిక చర్యతో తనకు సంబంధం కలగబోతున్న దన్న సంగతిని చిన్ని ఆండీ అణుమాత్రమైనా కల గనలేదు.

ఆండీ తొలిసారిగా ఒక ప్రజా భోజనశాలలో భుజించింది గ్రీన్స్‌బర్గు హోటల్లోనే. అతడు అక్కడి భోజనం