పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దగ్గరవుండి వార్తలను పుచ్చుకోవటమే కాకుండా పంపిస్తుండే వాడుకూడా. ఇప్పుడు అతని జీతం పెరిగి వారానికి నాలుగు డాలర్లు అయింది. టేపుమీద ఉబ్బెత్తుగా ముద్రింపబడె చుక్కలను, డాషులను చూడకుండానే యంత్రాలుచేసే ధ్వనులనుబట్టి వస్తున్న వార్తలను తెలుసుకోవచ్చునని అతడు త్వరలోనే గమనించాడు. కేవలం చెవితో వినటంతోనే వార్తలను గ్రహించి కెంటకీలో ఆపరేటరుగా పనిచేస్తున్న ఒకకుర్రవాడు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాడని చెప్పుకొంటున్న వార్తలు నిజమని చులకనగా విశ్వసించాడు.

హ్యూస్ అనే వృద్ధుడు టేపునుంచి వార్తలను చదివి, వ్రాసి యిస్తూ కార్యాలయంలో వ్రాయసగాడుగా పనిచేస్తున్నాడు. అతడు ఆండీ వార్తలను పంపిస్తు అందుకొంటూ వున్నప్పుడు గునవటం ప్రారంభించాడు. ఒక బాల వార్తాహారికి అందించే వార్తలను తనను ప్రతి వ్రాయమంటున్నందుకు అతడు తన అసంతృప్తిని వెల్లడిస్తున్నాడు. అందువల్ల ఆండీ అతనికి తెలియచెప్పటంకోసం వార్తలు వస్తున్నపుడు టేపు చుట్టును ఆపివేసి కేవలం అవి చేస్తున్న ధ్వనులను వినటం మూలంగానే వాటిని అందుకోవటం ప్రారంభించాడు.

హ్యూస్‌కు నింద వచ్చింది. "నీ విలా చేయటానికి వీల్లేదు" అని అతడు అడ్డు పెట్టాడు. "యిది పద్ధతికా"దన్నాడు.

"జిమ్మాలియొనార్డు కెంటకీలో ఇలాగ వస్తున్నా"