పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

టున్న వాడినని చెప్పి వాళ్ళకు కొన్ని మాటలను అందించి, వాళ్ళజవాబు మాటలను అందుకుంటుండేవాడు. ఒకరోజు ఉదయం అతడు ఒంటరిగా వున్నప్పుడు ఫిట్స్‌బర్గుకు ఒక వార్తను అందుకుంటారా అని తీవ్రంగా అడగటం జరిగింది. అలా అడగటం ఫిలడల్పియానుంచి.

"మరణాన్ని తెలియజేసే అతి జరూరైన వార్తను మీరు అందుకుంటారా ?" అని ఫిలడల్ఫియానుంచి అడిగింది.

"అందుకుంటాము" అని ఆండీ సమాధానం చెప్పాడు.

వార్తలను అందుకునే సాధనాలు ఆ రోజుల్లో చుక్కలను, డాషులను చిన్న కాగితపు ముక్కలమీద ముద్రిస్తుండేవి. ఆండీ ఆ వార్తకు మేలు ప్రతి వ్రాసుకొని అందిచటంకోసం పరుగెత్తాడు. తాను చేసిన సాహసాన్ని గురించి మిస్టర్ బ్రూక్స్ ఏమని భావిస్తాడో అని అతడు కొంత ఆందోళన చెందాడు. "అది చాలా జరూరయినది కావటంవల్ల తాను అందుకున్నా" నని క్షమాపణ చెప్పుకున్నాడు.

"మంచిపని చేశావు. ఇక్కడ నీవు ఒంటరిగా వుంటున్నప్పుడు అలా చెయ్యవచ్చు" అని మిస్టర్ బ్రూక్స్ ఆర్ద్రంగా అన్నాడు. అయితే, కడు జాగ్రత్తగా వుండాలి. తప్పులు అవటానికి వీల్లేదు సుమా !" అనిహెచ్చరించాడు.

ఈ సంఘటన జరిగిన కొద్దికాలంనుంచి ఆపరేటర్లు మధ్యాహ్న భోజనానికి బయటికి వెళ్ళినప్పుడు ఆండిని ఒంటరిగా కార్యాలయంలో వుంచి పోతుండేవాళ్లు.అతడు బల్ల