పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/57

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నిశ్రేణికా రోహణం

4

వార్తాహారి బాలుడుగా ఆండ్రీ వుద్యోగం సంవత్సరం మీద మరికొద్దికాలం గడిచింది. మొదటినుంచి అతడు తంతి సాధనాలంటే విశేషమైన ఆసక్తిని చూపిస్తుండేవాడు. అవకాశం దొరకినప్పుడల్లా ఆపరేటర్లు వార్తలను ఎలా పంపిస్తారో చూస్తూ, ఎలా స్వీకరిస్తారో వింటూ వుండేవాడు. ఉదయం కార్యాలయాన్ని చిమ్మి పరిశుభ్రంచేయటానికి వచ్చిన సమయాలల్లో అతడు మోర్స్ అక్షరమాలను నేర్చుకున్నాడు. చుక్కలకుగాను వేగంగాను, తీక్షణంగాను నొక్కటము, డాష్‌లకోసం దీర్ఘమైన కటక్కుమనే ధ్వనులు చేయటము సాధనచేశాడు. కార్యాలయంలోని ముచ్చట్ల వల్ల అతడు పదకొండు పంతొమ్మిది సంవత్సరాల మధ్యవయస్సు కుర్ర వాళ్ళే ఇతరచోట్ల వార్తలను పంపించటం, పుచ్చుకోటం చేస్తుంటారని గ్రహించి ప్రక్కస్టేషన్లను పిలవాటానికికూడా సాహసించాడు. అక్కడ వుండే పిల్లలతో తాను నేర్చుకుం