పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/56

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


విశాల హృదయంగల తల్లి అన్నది. "నీ కెంతసేపు ఇష్టమైతే అంతసేపు స్కేట్ చేయవచ్చు."

"అంతసేపు నేను ఒప్పుకోను" అని ఆమె అభిప్రాయానికి తండ్రి ఒక సవరణ చేశాడు. తండ్రి "ఆండ్రా ! ఉదయం కొంతసేపు స్కేటింగు చెయ్యటంలో నాకేమీ అభ్యంతరం లేదు. కాని, నీవు నాతో కలిసి చర్చికి పోవటానికి సకాలళ్లో ఇంటికి తిరిగి వచ్చేయాలి.

అందువల్ల ఆండీ పెందలకడనే లేచాడు. గడ్డకట్టిన నదిమీద కొన్ని గొప్ప మహిమగల గంటలను గడిపాడు.