పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వార్తాహారి బాలుడు డబ్బు చెల్లించకుండా పుస్తకాలను తీసుకొనే వీలు వున్నదా !" అని లైబ్రేరియన్‌ను ప్రశ్నించాడు.

"నీవు ఎపంటిస్‌గా బౌండ్ అయినావా." అనిలైబ్రేరియన్ ప్రశ్నించాడు.

"లేదు. కాని..."

"వార్తాహారి బాలురు చేతులతో పనిచేసేవాళ్లుకారు" ఇది తుది నిర్ణయంగా లైబ్రేరియన్ సమాధానం చెప్పాడు.

కాకపోవచ్చు అయితే వాళ్లు చాలా పని కాళ్ళతో చేస్తారు" ఆండీ వెంటనే ప్రతిగా సమాధానం.

"ఏమయినా రెండూ ఎన్నటికీ ఒకటి కాజాల"వని లైబ్రేరియన్ అన్నాడు. బాగా విసిగిపోయి ఆండీ ఈ విషయాన్ని జనమందరికీ తెలియజేయాలని నిశ్చయించుకొన్నాడు. బౌండు కానంతమాత్రంచేత స్టోర్స్‌లలో పనిచేసే పిల్లలను దాత వేరుగా ఊహించారని భావించేటందుకు వీలు లేదు. వీరిలో చాలామంది నిర్ణీతమయిన రెండుడాలర్ల సుంకాన్ని యిచ్చుకోలేరు. కనుక గ్రంధాలయాన్ని వినియోగించుకోటం కేవలం ఎప్రంటిస్ లకు మాత్రమే పరిమితం చేయటంలో క్రొత్త మేనేజర్లు దాత వుద్దేశాన్ని అపార్ధం చేసుకొన్నారని లోపాన్ని ఎత్తిచూపుతూ అతడు వ్రాసిన లేఖను 'ఫిట్స్‌బర్గు డిస్పాచ్‌' పత్రిక ప్రకటించింది. ఆ వుత్తరం చివర అతడు 'బౌండు కాని శ్రామిక బాలుడు' అని సంతకం చేశాడు.