పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/50

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పుస్తకాలు మాత్రమే చదివాడు. కార్నెగీ కుటుంబానికి పుస్తకాలను కొనుక్కొనేటందుకు ఖర్చుపెట్టగల అవకాశం లేదు. కల్నల్ జేమ్స్ ఆండర్ సన్ అనే ఉద్యోగాన్ని విరమించుకొన్న ఒక ఉత్పత్తిదారు నాలుగువందల సంపుటాలున్న ఒక గ్రంధాలయాన్ని చేకూర్చుకొన్నాడు. ఆదివారంనాడు ఆ కల్నలే లైబ్రేయన్‌గా పనిచేస్తున్నప్పుడు కుర్రవాడు గ్రంధ మొకటి తీసుకొని మళ్ళీ వచ్చే శనివారందాకా దాన్ని తనదగ్గిర వుంచుకోవచ్చు. సక్రమంగా అతడు దాన్ని తిరిగి ఇస్తే మళ్ళీ మరొకదాన్ని పుచ్చుకోవచ్చు. కల్నల్ పెట్టిన ఈ పధకం బాగా ప్రాకిపోయింది. అందువల్ల ఉదార స్వభావుడయిన కల్నల్ దీనికి విస్తృతం చెయ్యటానికి నిశ్చయించాడు. న్యూయార్క్‌కు వెళ్ళొ అతడు మరిన్ని పుస్తకాలు కొన్నాడు. గ్రంధసంఖ్య పద్ధెనిమిది వందలదాకా పెరిగింది. వాటితో ఆయన నగరం ఒక నివేశనాన్ని చూపిస్తే "మెకానిక్స్ అండ్ ఎప్రంటిసిస్ లైబ్రరీ" అన్న పేరుతో ఒక గ్రంథాలయాన్ని నెలకొల్పటానికి నిశ్చయించు కున్నాడు. కౌన్సిల్ వెంటనే అందుకు అంగీకరించింది. జీతమిచ్చి ఒక లైబ్రేరియన్ నియమించటంతో పని నడిచిపోతుంది.

అయితే ఈ క్రొత్తసంస్థ ఆండ్రూకు దెబ్బతగిలే ఒక నిబంధనను పెట్టింది. అది ఎల్లప్పుడు ఎ పంటిస్ లుగా వున్నవాళ్ళే ఈ గ్రంథాలయాన్ని ఉచితంగా వుపయోగించుకోవచ్చు ఇతరులు అందులో నుంచి పుస్తకాలను తీసుకొనే అవకాశమిచ్చినందుకు సంవత్సరానికి రెండు డాలర్లను చెల్లించాలన్నది. ఆండీ ఆ గ్రంథాలయానికి వెళ్లాడు. "తంతి