పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/44

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఎడ్విన్ యం స్టాస్టన్ ఒకడు. ఆయనతో పరిచయం కలిగినందుకు అతడు ప్రత్యేకంగా గర్విస్తుండేవాడు.

తంతికార్యాలయం వారి వ్యాపారం వృద్ధిపొందుతుండుటంవల్ల మరొక కుర్రవాడు అవసరమై ఉండటాన్ని గురించి మిస్టర్ బ్రాక్స్ ఆండ్రూతో మాటాడాడు. "ఆర్యా ! నేను ఒకణ్ని, తీసుకురాగలనని చెప్పి అలిఘనీ నుంచి తన యిరుగుపొరుగు కుర్రవాడయిన డెవిడ్ మెక్కారోను తీసుకొచ్చాడు. జార్జి మెక్లయిన్ వెళ్ళిపోయినాడు. తరువాత ఆండీ బాటమ్ హూషీర్లలోనుంచి ఒకరి తరువాత ఒకరిని ముగ్గురు కుర్రవాళ్ళను - రాబర్టు పిట్కైరన్, హెన్రీ ఆలివర్, లిల్లీ మోర్లా డీ లను - తెచ్చి ఒప్ప జెప్పాడు. వారు వంతుల ప్రకారం కార్యాలయంలో వ్యాపారసమయం ప్రారంభం కాకముందే వూడ్చి బాగుచేయటానికి పెందలకడ వస్తుండేవారు. ఈష్టరనే టెలిగ్రాఫ్ కంపెనీ సూపరంటెండెంటు రైడ్ - ఇతడుకూడా డన్ఫ్‌ర్మ్‌లైన్ వాడే - పర్యవేక్షణకోసం ఫిట్స్‌బర్గ్‌కు వచ్చినప్పుడు ఈ స్కాచ్ వార్తాహారి బాలదళాన్ని చూచి ఎంతో సంతోషించి వారందరికీ ఒకేరకమైన దుస్తులు ఏర్పాటు చేయించాడు - ముదురుపచ్చ జాకెట్లు, ట్రౌజర్లు. ఈ వేషంతో వాళ్ళ నగరంలోని వీధుల్లో వెడుతున్నప్పుడు విశేషంగా జనులదృష్టిని ఆకర్షిస్తుండెవాళ్లు.

ఒక పరిమితి దాటిన తరువాత తంతివార్తలను అంద జేసినందుకు వార్తాహార బాలురకు అదనంగా పదిసెంట్లను