పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/43

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వార్తాహారి బాలుడు

3

ఆండూ దాన్నిగురించి తరువాతి కాలంలో వెనుదిరిగి చూచుకొన్నప్పుడు ఆ రోజు అతనికి తన జీవితంలో ఒక మైలు రాయిలా, ఒక పరివర్తన బిందువుగా కనిపించింది. చీకటికొట్టులో నుంచీ, కంపుకొట్టే నూనెతొట్టి దగ్గరనుంచీ బయటపడి ఇప్పుడు అతడు మంచి వెలుగులో, తంతికార్యాలయ కలకలంలో, నగరవీధుల్లో, కర్మాగారాల్లో, గిడ్డంగుల్లో, స్వేచ్ఛతో సంచరిస్తున్నాడు. ఇంటిదగ్గర ఎప్పుడో గాని తిండి తినటం పడటం లేదు. దాన్ని గురించి కుటుంబంలో వారికి చెప్పటానికైనా అతనికి అవకాశం దొరకటం లేదు. వెంటనే వీధుల అమరికను, వాటిల్లో నడుస్తున్న వ్యాపారాలను, నగరాన్ని గురించినదంతా తెలుసుకోటానికి అతడు పూనుకున్నాడు. నగరంలోని ప్రముఖులను - వ్యాపారస్థులను, వ్యాపార కార్యనిర్వాహకులను, వృత్తి నిర్వాహకులను - అందరినీ తెలుసుకున్నాడు. అతని పరిచయస్తులలో తరువాత కాలంలో అధ్యక్షుడు లింకన్‌కు యుద్ధ కార్యదర్శి అయిన