పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/42

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నుంచి వార్తలను పుచ్చుకో ఇవాళ ఇతణ్నీ నీవెంట తీసుకో వెళ్లు, నువ్వు ఎలా పనిచేస్తావో చూస్తాడు".

ఆపరేటర్ల గదిలో ఆండీ కొద్ది నిముషాలు జార్జితో గడిపాడు. అప్పుడు అతడికి తండ్రి విషయం జ్ఞప్తికి వచ్చింది.

"అరె" అని కేక పెట్టాడు. మా నాన్నను అక్కడ ప్రక్కదారి దగ్గర నిలువబెట్టి వచ్చాను. క్రిందికి వెళ్ళి ఆయనకు చెప్పి వస్తాను".

పరుగెత్తుకుంటూ మెట్లు దిగాడు. "నాన్నా! అంతా నిర్ణయమైంది". పెద్దగా అన్నాడు. "నాకు ఉద్యోగమిచ్చారు. వెంటనే పని ప్రారంభించాలి".

కాంతిని విరజిమ్ముతున్న అతని ముఖం అతడెంత సంతోషంగా ఉన్నాడో తండ్రికి తెలియ జెప్పి ది.

కుర్రవాడి బుజంమీద చెయ్యి ఉంచి "నిన్ను గురించి నా కెంతో సంతోషంగా ఉంది. బాబూ!" "ఇందుకు మీఅమ్మ సంతోషిస్తుంది. నీవు చేతనై నంత బాగా పని చేస్తావని నాకు తెలుసు", అన్నాడు.