పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పోవచ్చు. కానీ నిర్వహించగలనన్న నమ్మకం నాకుంది. నేకోరేదల్లా నాకొక అవకాశ మిప్పించమని".

జీతం - వారానికి రెండున్నర డాలర్లు - నీకు సంతృప్తికరంగా ఉందా !" అని అడిగాడు మేనేజరు.

"ఇంకా నేను ఎక్కువ సంపాదించుకో గలిగేదాకా సంతృప్తికరమే".

"పని ఎప్పుడు ఆరంభిస్తావు!"

దీన్ని గురించిన నిర్ణయం చేయటానికి ఆండ్రీకి రెండుక్షణాలకంటే ఎక్కువకాలం అవసరం లేకపోయింది. "మీరు కోరితే ఇప్పుడే ఆరంభిస్తాను".

"చాలా బాగుంది" అని గొంతు పెద్దదిచేసి అతడు "జార్జీ!" అని పిలిచాడు.

ఆండీ కంటే పెద్ద కుర్రవాడొకడు ప్రక్కగదిలోనుంచి వచ్చాడు.

"జార్జీ ! ఇతడు మన నూతనవార్తా హరి, ఆండ్రూ కార్నెగీ" అన్నాడు మిష్టర్ బ్రూక్స్ . ఆండ్రూ, జార్జి మెక్లైన్ నీకు నగరాన్ని, మా పద్ధతులను పరిచయం చేస్తాడు".

జార్జి ఆండీవంక తిరస్కార పూర్వకంగా చూస్తున్నాడు. "ఇతడు మనకెందుకు పనికివస్తాడు. చెయ్యవలసిన పనికి ఇతడు చాలా చిన్న వాడు" అన్నాడు.

"ఆ నిర్ణయం చేయటం నాకు విడిచిపెట్టు అని మిష్టర్ బ్రూక్స్ ముక్తసరిగా సమాధానం చెప్పాడు. "వెంటనే ఆండ్రూని లోపలికి తీసుకుపో ఆపరేటర్ల దగ్గర