పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/40

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మైళ్లు నడిచి పిర్త్ అండ్ వుడ్ వీధుల మూలలలో ఉన్న తంతి కార్యాలయం దగ్గరికి చేరారు. మిస్టర్ బ్రూక్స్ కార్యాలయం రెండవ అంతస్థులో కనిపించింది. మెట్లగది ద్వారం దగ్గర ఆండ్రూ త్రోవలో తాను చేసుకొన్న నిర్ణయానికి తగ్గట్టుగా ప్రవర్తించాడు.

ఆగి తండ్రికి ఎదురు మళ్లగా నిలిచి అతడు "నాన్నా! దయవుంచి మీరు ఇక్కడి ఉండిపొండి. ఈపనిని నన్నే స్వయంగా చెయ్యనివ్వండి. మిస్టర్ బ్రూక్స్‌తో నన్ను అన్నాడు. ఒంటరిగా మాట్లాడ నివ్వండి" అయితే తన భయమేమిటో అతడు చెప్ప లేదు. తండ్రి తన చిన్ని రూపంమీద దృష్టినిలి చేటట్లు మాట్లాడి ఉద్యోగాన్ని పొందే అవకాశం అతిస్వల్పంగా ఉండేటట్లు చేస్తాడేమో అన్నది. అతని భయం. "నాన్నా! ఈపని నంతటినీ నేనే స్వయంగా చేసుకొంటా"నని వేడుకొన్నాడు.

తండ్రి అతనివంక శోధనాపూర్వకంగా చూసి అన్నాడు. "మంచిది. నీకోసం నేను ఇక్కడ ఎదురు చూస్తుంటాను". అందువల్ల తండ్రి ప్రవేశద్వారం దగ్గర ఆగిపోయాడు. ఆండ్రూ మేనేజరును చూడటానికి వెళ్లాడు.

మిస్టర్ బ్రూక్స్ ఎంతో దయగా అప్పుడే కుర్రవాడికి ధైర్యం చెప్పాడు. జీతాన్ని గురించిన ప్రసంగంలో కూడా ఉదారంగా ఉండటానికి యత్నించాడు.

పిట్స్‌బర్గ్ నాకు పూర్తిగా తెలియదు. అయితే, అతిత్వరితంగా తెలుసుకొంటాను. నేను చిన్నవాడినని నాకు తెలుసు, బహుశ: ఈ ఉద్యోగానికి తగినంత బలిష్ఠుణ్ని కాక