పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/39

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆండ్రూకు ఆరాత్రి నిద్రపట్టటం కష్టమయింది. అతడు మర్నాడు ఉదయమే పెందలకడ మేల్కొన్నాడు.

ఉదయ భోజనవేళ తండ్రి ఇలా అభిప్రాయ ప్రకటన చేశాడు. "మిస్టర్ బ్రూక్స్‌ను చూసేటప్పుడు నేను కూడా నీవెంట వస్తాను. అయితే దీన్ని గురించి ముందుగా మిస్టర్ హోతో ఆలోచిస్తాను".

చాలా చిన్న విషయాన్ని గురించి తండ్రి పెద్దగొడవ చేస్తున్నాడని ఆండ్రీకి అనిపించింది. విషయాన్ని తనకు వదలిపెడితే సూటిగా మిస్టర్ బ్రూక్స్ కార్యాలయానికి వెళ్ళి "నేను ఉద్యోగంలో చేరుతాను" అని చెప్పేవాడు. అయితే తండ్రి అంటే అతనికి "అమితగౌరవం. అందువల్ల ఏమీ అనలేదు. మిస్టరు హాన్‌తో ఆలోచించటానికి మిస్టర్ కార్నెగీ అతత్వ తంగా వెళ్లాడు.

అతణ్ణి పోగొట్టుకోటంవల్ల నాకు ఎంతో అసౌకర్యం కలుగుతుంది కానీ అందువల్ల ఆండ్రూకు బహుశా: అధిక ప్రయోజనం ఉండవచ్చు కనుక అతణ్ణి నాదగ్గరనుంచి మార్చవలసిందే అని నేను సలహా ఇస్తా ది తంతివారు అంగీకరించకపోతే అతడు తిరిగి ఇక్కడికి రావచ్చు" అన్నాడు సత్యాన్ని పలికే మిస్టర్ హె

ఇంతలో ఆండీకి మంచి పంట్లాం తొడిగి మంచి నీలవర్ణపు జాకెట్టువేసి ముఖంతుడిచి, బూడిదరంగు జుత్తును జాగ్రత్తగా సరిదిద్ది దువ్వి, చివర దిదుళ్లు పూర్తిచేసి పరికిస్తున్నది తల్లి వసంతపు ఉదయవేళ అతడు, ఆతని తండ్రి రెండు