పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"నీకు వారానికి ఒక డాలరు ఇరవై సెంట్లు వస్తుంది". అది నమ్మ లేనంత తక్కువజీతం. అయినా, అది కుటుంబనిర్వహణానికి తానుకూడా సాయపడిన వాడనౌతానన్న వుద్దేశంతో ఆండీ అది విని పరవశుడైనాడు. తరువాత అతడు తండ్రి సూర్యోదయానికి పూర్వమే లేచి - చలికాలంలో ఇంకా ముందుగానే లేచి అతి వేగంగా ఉదయ భోజనంచేసి స్థిమితంగా సాయంత్రం ఆరుగంటలవరకూ పనిచేయట కోసం కర్మాగారానికి ఉరుకులెత్తే వాళ్లు. లిల్లీ కార్నెగీ వ్యక్తిత్వగల భావకుడు. ఇతరుల ఆజ్ఞలకు లోబడి ఒక నిర్ణీత కార్య క్రమాన్ని అనుసరించి కూలికి ఒకరి దగ్గర పనిచేయటానికి ఏమాత్రం తగనివాడు. నేతపని యంత్రంమీద జరుగుతుండడాన్ని చూసి అతని అంతరాత్మ ఎదురు తిరుగు తుండేది. తట్టుకో లేక కొన్ని నెలలు గడచిన తరువాత కర్మాగారాన్ని వదలి వేశాడు. పెరటిలో ఉన్న మగ్గాన్ని చేరుకొని బల్లగుడ్డలు మరిన్నిగా అడపా దడపా తయారుచేసి ఇంటింటికి మైళ్ళ తరబడిగా నడచివెళ్ళి ఒకటో రెండో ఆ బల్లగుడ్డలను అమ్ముకొస్తుండేవాడు.

కుటుంబానికి తమ పూర్వ దేశంనుంచి వలసవచ్చిన వారితో పరిచయం వృద్ధిపొందుతున్న రోజుల్లో ఆండ్రూ మరొక స్కాట్లండ్ దేశీయుడైన జాన్ హెను కలుసుకున్నాడు. అతడు అతనికి చాలా ఎక్కువ జీతంతో - అంటే వారానికి రెండు డాలర్లు. ఒక వుద్యోగ మిస్తా నన్నాడు. ఇంతవరకు అతడు చేయవలసివచ్చిన అసంతృప్తికరమైన పనులన్నిటిలోకీ అది దొడ్డది. చిన్న ఇంజనుమీద దృష్టినిలిపి,