పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/31

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


లోని హాస్యాస్పదమయిన అంశం. వీరూ ఆండీ లాగానే అమెరికాలో కాక తమ పూర్వ దేశమయిన స్కాట్లండులో పుట్టినవాళ్లు. అయితే కొద్ది కాలంలోనే ఆండీ ఆ తన స్కాచ్ యాసను అతి వేగంగా పోగొట్టుకొన్నాడు. కొద్దొ నెలల్లోనే తానుకూడా "బాటాయ్ హూషియర్ల"లో ఒకడయినాడు. ఆ పిల్లలందరూ తరువాతి కాలంలో ఎంతో అభివృద్ధికి వచ్చి ప్రముఖపౌరులైనారు. ఉచ్ఛస్థితికి రావటానికి వాళ్ళలో కొందరికి ఆండీ తొలుతగా దోహదంచేశాడు. ఇది గమనించవలసిన మరో విషయం.

దరిదాపుగా ఫలంహితమైన బేరపుతిరుగుడు తిరిగివచ్చి అమ్ముడుపోని గుడ్డలను ఒక మూలపడేసి నిట్టూరుస్తూ "అమ్మా ! ఇదేమీ ప్రయోజనం లేదు. ఈ రకంగా అయితే జీవనోపాధిని సంపాదించుకో లేము. ఇక బ్లాక్ స్టాక్ కాటన్ మిల్లులో వుద్యోగం చూసుకోక తప్పదు!" అని ఒక రోజున అన్నాడు. విలియం కార్నెగీ అక్కడ తనకు పని దొరుకుతుందని ముందుగానే విచారణచేశాడు. పనికి కుదిరాడు. తరువాత కొద్ది దినాలకు "ఆండ్రా ! మిల్లులో నీకు పనికూడా ఉంది" అన్నాడు.

ఆండీ పనికోసం వెతుకుతున్నాడు. ఎక్కడకు వెళ్ళినా అతణ్ని చాలా చిన్న వాడంటున్నారు. ఇప్పుడు అతడికి అమితోత్సాహం కలిగింది. "ఎటువంటి పని నాన్నా !" అని అడిగాడు.

"ఉండలు చుట్టటం"

"అందుకు మరి నాకు జీతమిస్తారా!"