పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/27

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సంకటపు సంవత్సరాలు

2

అలిఘనీ, 1848 లో మాగుడువాసన, బురా, కొల్ల కొల్లగా గడ్డిపట్టి వుండే వీధులు, ప్రతివసంతంలోను వచ్చి బాధపెట్టే వరదలు, అప్పుడప్పుడు విజృభించే కలరాలతో ఆకర్షణ ఏమాత్రమూ లేని నగరాలలో వొకటిగా వుంటుండేది అయితే అది క్రమరహితంగా మాత్రం వుండేదికాదు. అయితే అందులో ఇరవై రెండువేల మంది నివసిస్తున్నా అక్కడి రక్షకభటుల సంఖ్య నలుగురుమాత్రమేనని ఆండ్రూ కజిన్ డాడ్‌కు వ్రాసిన వుత్తరంలో సగర్వంగా తెలియజేశాడు. ఇందులోని జనంలో యెక్కువమంది ప్రతినిత్యమూ ఉదయము, సాయంకాలము అలిఘనీ బ్రిడ్జిమీదగా నడిచివెళ్ళి పిట్స్‌బర్గులో పనిచేస్తుంటారు.

ఆత్మబంధువులైన మిసెస్ థామస్ హోగన్, ఆంట్ అన్నా ఐట్కిన్‌లు కార్నెగీలకు హృదయపూర్వకమైన స్వాగత మిచ్చారు. వీరు అందరు రెబెక్కా వీధిలో నివాసాలు ఏర్పరచుకొన్నారు. వీళ్ళల్లో ఎవరూ సంపత్తి కలవారు కారు. అయినా భద్రత లభించటంవల్ల తాము సుఖంగా వున్నామనే భావిస్తున్నారు. అంహల్ టామ్