పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/253

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ వేసగిలో జార్జి లాడర్, జూనియర్ షాడోబ్రూక్‌ను చూడటానికి వచ్చాడు. ఇరువురూ కలిసి తీరుబడిగా షికారుకు వెళ్ళారు. చేపలు పట్టారు.చెక్కర్స్ ఆట లెన్నొ ఆడారు. చివరకు కజిన్ డాడ్ కూడా తుది "గుడ్‌బై" చెప్పి వెళ్ళాడు.

ఆగష్టు మొదట్లో కార్నెగీ నెమోనియా వల్ల బాధపడుతున్నాడు. మిసెస్ కార్నెగీ ఒక విశ్వాసపాత్రుడయిన సేవకుడు, ఒక మారిసన్ వంశీయుడు, మూడువేళలా అతడికి అప్పు డప్పుడు సేవ చేస్తున్నాడు. వ్యాధిఆరంభమైన రెండవ రోజు, ఆదివారం, కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఆదివారం మోర్లేకు వ్రాసే వుత్తరం వ్రాయ లేదు. ఆనాటి సాయంత్రం అతడు చాలా నిస్సత్తువగా వున్నా అతని స్థితి సంతృప్తికరంగానే వున్నట్లు కనిపించింది. రాత్రి సెలవు తీసుకొంటూ "ఆండ్రీ నీవు సుఖంగా నిద్రిస్తున్నావని భావిస్తున్నానని ఆశిస్తున్నా" నన్నది భార్యా.

"లౌ, నేను అలాగే ఆశిస్తున్నాను." అని అతడు సమాధానం చెప్పాడు.

అనతి కాలంలోనే గాఢము, ప్రశాంతము అయిన నిద్ర అతణ్ని ఆవరించింది. దాని నుంచి తిరిగి మేల్కో లేదు.

న్యూయార్క్ టారీటౌనుకు కొంతవుత్తరంగావున్న 'స్లీపీ హాల్ సెమెట్రీలో వాషింగ్టన్ ఇర్వింగు విశ్రాంతి ప్రదేశా