పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/25

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మిసెస్ కార్నెగీ కనులలో బాష్పబిందువులు క్రమ్మి వేశాయి. "మరి జాన్ ఇందుకు ఒప్పుకున్నాడా!" అని అడిగింది.

"అవును. అయితే ఇది చాలుతుందా అన్నదే మరి!"

"చాలు ననుకుంటాను. ఎలాగో ఇముడ్చుకొని గడుపుకొంటాము" అన్నది మార్గరెట్. "ఓహో! అయ్‌లీ! నీకు కృతజ్ఞతలు తెలుపుకోటానికి నాకు మాటలు రావటం లేదు. గీచి పోగుచేయగలిగి నంత తొందరలో తిరిగి ఇచ్చివేస్తామని వాగ్దానం చేస్తున్నాను"

మార్గరెట్ కార్నెగీ ప్రయాణం సన్నిహితమైనప్పుడు డన్ప్‌ర్మ్‌లైస్ దు:ఖంలో మునిగిపోయింది. ఎన్నో ఇళ్ళల్లో ఇందుకు కన్నీరు కార్చారు. ఎరిగినవా ళ్ళందరికీ ఆమె వివేకంగల సలహాదారుగను, మిత్రురాలుగను మెలగుతుండేది. ఆపద వచ్చినప్పుడు అమితమైన సాయం చెయ్యటానికి ఆమె ఎల్లవేళలా సంసిద్ధురాలై ఉండేది. అయితే అమెరికాకు వెళ్ళి పోవాలన్న విషయంలో కుటుంబంలోని ఇతర సభ్యులందరికంటే ఎక్కువ పట్టుదల ఆమెదే. ఆమె భర్త వెళ్ళిపోయినందుకు తగినంతగా చింతించాడు. తనకు అతి ప్రియుడయిన అంకుల్ లాడర్, డాడ్‌కి మరి ఇతర బంధువులకు దూరుడై నగరంనుంచి విడిపడిపోతున్నందుకు అత్యధికంగా చింతపడ్డవాడు ఆండ్రూ. నలభై సంవత్సరాలకు తరువాత అతడు ఇలా! వ్రాశాడు: "హిందువులకు వారణాసి ఎటువంటిదో, మహమ్మదీయునికి మక్కా ఎటువంటిదో, క్రైస్తవునికి జెరూ