పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/248

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఎక్కువ ధనం అవసరమని గ్రహించి ఈ భృతిని స్వీకరించే వారు తమ కాభృతి జీవించినంత కాలం భృతిముడుతుందనే నమ్మకాన్ని కల్పించటం కోసం కార్నెగీ యాబై లక్షల డాలర్లతో మరొక ధర్మనిధి నేర్పాటు చేశాడు. దీని కితోడు స్కాట్లండులో మరొక పట్టిక-దీనికి ధర్మకర్త డన్ఫ్‌ర్మ్‌లైను ఏర్పాటయింది. లోని డాక్టర్ రాస్. ఈ పట్టికలోనే రాబర్టు బరన్స్ మునిమనుమరాలి పేర, బాల్యంలో కార్నెగీకి అతి ప్రియమిత్రుడైన డన్ఫ్‌ర్మ్‌లైన్ పోష్టుమేన్ కుమార్తె పేరు వున్నవి.

ఒక రోజున న్యూయార్క్ కార్నెగీ కార్పొరేషన్ అధిపతి అయిన కార్పొరేషన్ డాక్టే హెన్రీ యన్. ప్రిట్చెట్‌ను యింటికి రమ్మని పిలిపించటం జరిగింది. అతడు వచ్చేటప్పటికల్లా కార్నెగీ తన డ్రాయింగ్ రూములో అటు యిటూ తిరుగుతున్నాడు.

"డాక్టర్ ప్రిట్చెట్, అమెరికలోని అధ్యక్షత క్రింద నడుస్తున్న సంస్థవంటి నొక దానిని కొద్దియెత్తులో నేను గ్రేట్ బ్రిటన్‌కోసం ఏర్పాటుచేయదలిచాను. నిశ్చయంగా దాని కెక్కువ డబ్బు అవసరం లేక పోయినప్పటికీ అది ఇవ్వటానికికూడా నా దగ్గర డబ్బు లేదు. నా భార్య , కుమార్తెల కోసం విడిచిపెట్టిన డబ్బులోనుంచి నేను మళ్లా ఒక పది మిలియన్లు తీయదలచ లేదు. అందువల్ల మీ కార్పొరేషన్ ధనంలోనుంచి పది మిలియన్లు తీయదలిచాను" అన్నాడు.

డాక్టర్ ప్రిట్చెట్ కొంత సంకట పడ్డట్లు కనిపించి అన్నాడు: