పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/247

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కల్పనలో తెలుసుకునే అవకాశం అతడికి సహజంగా లేదు. అయితే ఈ వుత్తరాల నన్నిటినీ అతడు జాగ్రత్తగా పరిశీలించి, సత్యాలని తోచిన కొన్నిటిని ఎంచి వాటిమీద "ఇతణ్ని నెలకు ముప్పదిడాలర్లమీద వుంచండి," "ఈవృద్ధురాలు సుఖంగా జీవించటానికి యే లోపం కలుగకుండా చూడండి" ఈ రీతిగా కార్యదర్శి పొయిస్టన్ వుపయోగార్ధం సూచనలు వ్రాస్తుండేవాడు. వృద్ధాప్య జీవన భృతిపట్టికలో చేర్చేవారిలో ఎందరో పూర్వం అతడెరిగినవాళ్లు. యౌవనంలోనో, బాల్యంలోనో అతనితో ఏదో విధమైనసంబంధం కలవాళ్ళను చేర్చటం తప్పక జరిగేది. అట్టివారిలో కొందరు మాత్రమే అతడికి వ్రాసుకొనేవాళ్లు. ఇందులో ఎక్కువమందిని గురించి ఇతరులు వ్రాయటమో, అతడే ఎన్నటమో జరిగేది. వీరిలో కార్నెగీకి ప్రధమంగా ఉద్యోగమిచ్చిన వ్యక్తి కుమార్తెకూడా వుంది. అతడు ఒకప్పుడు పిట్స్‌బర్గులో మంచి ఉచ్చదశను అనుభవించిన వ్యాపారస్థుని కుమారుడు, అతనికి బాల్యంలో కార్నెగీ ఆండీగా తంతివార్తలను అందజేస్తుండేవాడు. కాని ఇప్పుడతడు ఆశక్తుడు, పేదవాడు. పూర్వం అలీఘనీలో స్వీడన్బొర్జియన్ సంగీత సమ్మేళనంలో సహ సభ్యులుగా వుండేవాళ్లు. ఇరువురు వృద్ధ కన్యలు 'నేను యౌవనోల్లాసంతో వారితో కలిసి నృత్యం చేస్తుండేవాణ్ని' అని కార్నెగీ వ్రాశాడు.

ఆయన మృతినొందే వేళకు పూర్వమే ఆ పట్టిక ఐదువందల పేర్లకు మించి వుండేది. కాలం గడిచిన కొద్దీ ఇందుకు