పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/246

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దృష్టిలో దేశం అవమానిత మౌతుందని వారు భయపడ్డారు. అందువల్ల కార్నెగీ మనసులో యిష్టం లేకపోయినప్పటికి ఈ ఉద్దేశాన్ని కొంత విరమించుకోవలసి వచ్చింది. దీన్ని పూర్తిగా విడిచిపుచ్చక పోవటం మనం మున్ముందు గమని స్తాము.

1911-12 ల శీతకాలం అతడికి ఆ బాల్యమిత్రుడైన టామ్ మిల్లర్ మృతివల్ల అతి వేదనతో గడిచిపోయింది. యింతకు కొద్ది నెలలకు పూర్వమే అతడు ఆత్మకథ వ్రాస్తూ అందులో యిలా అన్నాడు: "అతడు యింకా సజీవుడై వుంటే మిక్కిలి ప్రేమపూర్వకమైన వెలుగును, మాథుర్యాన్ని క్రుమ్మరిస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు గడచినా అతడు ఇంకా యింకా విలువైన మిత్రుడ నని అనిపిస్తున్నాడు" అని వ్రాశాడు. యిప్పుడు టామ్ వెళ్ళిపోయినాడు. అందువల్ల మరో వాక్యం చేర్చాడు. "ఇకనుంచీ జీవితానికి ఏదో లోటు తీరని లోటు - అతడు నా బాల్య జీవితంలోని సహచరుడు. వృద్ధాప్యంలో అతి ప్రియుడైన మిత్రుడు. అది ఎలాటిదైనా యిపు డత డెక్కడున్నా నేను అక్కడికి వెళ్ళవచ్చునా!"

అతడు తా నేర్పాటుచేసిన అన్ని నిధులను గురించి సంస్థలను గురించి యెంత గర్వించినా తన దానాలపట్టికలలో కల్లా అతడి కతి ప్రియమైంది అతని విరమణ భృత్యపట్టిక (Pensoin List) ఆర్థిక సహాయార్థం ప్రతి సంవత్సరం అతనికి వేలకొలది లేఖలు వస్తుంటాయి. ఈ ఉత్తరాలు వ్రాసిన వారిలో ఎందరు వంచకులో, వారు చెప్పే స్థితిగతు లెన్ని