పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చింది. యిక కుమార్తె యింకా పదిహేను పదహారు సంవత్సరాల వయసు కన్యక మాత్రమే. ప్రియమైన తన తండ్రి ఏదిచేసినా ఆమె కిష్టమే. అందుకే తృప్తిపడుతుంది. అందువల్ల 1912 లో కార్నెగీ కార్పొరేషన్ నిధి 12,50,00,000 డాలర్లు వరకూ వృద్ధిచేయబడింది. ఆ లోకోపకార పరాయణుడు ఒక సంవత్సరములోనే 13,00,00,000 (పదమూడు కోట్ల) పై చిలుకు డాలర్ల దానం చేశాడు.

కాంగ్రెసు మాజీ అధ్యక్షులకు వారి భార్యలకు తగిన ఏర్పాట్లను చేయలేకపోయినందుకు కొన్ని సంవత్సరాలనుంచి అతడు వ్యాకులపడుతున్నాడు. అమెరికాలోకల్లా అత్యున్నతమైన గౌరవ స్థానానికి, గణతంత్రప్రజా రాజ్యంలో అతినిష్టా యుతములు, బాధ్యతా యుతములు అయిన ఉన్నత పదవులకు వారిని నియోగించి వారి విరమణ కాలంలో గౌరవయుతంగాను క్లేశరహితంగాను జీవించే విరామభృతుల నివ్వకపోవటం కృతఘ్నత అనీ, అనాగరికమనీ అతడికితోచింది. ప్రభుత్వంవారికి తగ్గ ఏర్పాటు చేసేటంతవరకూ కార్పొరేషన్ ప్రతి సంవత్సరము ఇందుకుగాను 25,000 డాలర్లు యివ్వవలసిందని కార్నెగీ సూచన చేశాడు.

ఈ అభిప్రాయం ప్రకటితము కాగానే ప్రజల్లోనుంచి వ్యతిరేక భావం వెలివడ్డది. ప్రభుత్వం స్వీకరింపదగ్గ బాధ్యతను ఒక ప్రత్యేక వ్యక్తి గ్రహించటం అనుచితమని వారన్నారు. యిలా వారికి సిగ్గును కల్గించి విషయబోధ చెయ్యటమే ఈ పథకంలోని రహస్యం. ఈ చర్యవల్ల ప్రపంచ