పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/237

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అస్తమయం

14


యుద్ధాన్ని క్రమక్రమంగా రద్దు చేయగలుగుతుందనే ఉద్దేశంలో న్యూయార్క్ శాంతి సమాజం నిర్మితమైంది. ఈ ఆశయం విషయంలో కార్నెగీకి అత్యంత శ్రద్ధ ఉన్నట్లుగా అతడు తెలియజేయటంవల్ల ఆ సమాజంవారు అతణ్ని అధ్యక్ష పదవిని స్వీకరింపవలసిందని కోరారు.

"వద్దు, నాకు వ"ద్దన్నాడతడు "హృదయపూర్వకంగా నేను మీతో వుంటాను. ఇది మీకు తెలుసును. నాకు శక్తి వున్నంతవరకూ మీకు తోడ్పడతాను. అయితే, నా కున్న యితర వ్యవహారాలవల్ల ఈ శాంతి సమాజాధ్యక్ష పదవిని స్వీకరించ లేను. తీరుబడి వుండదు. నేను నాకున్న కాలంలో ఎక్కువ భాగం ఇందుకు వినియోగించాలని వుంది. అయితే ఆ పని చేయలేకపోతున్నాను."

తన్ను అభ్యర్ధించ వచ్చిన శాంతి సమాజ సభ్యులు వెళ్ళిపోయిన తరువాత కార్నెగీని అంతరాత్మ బాధ పెట్టటం మొదలెట్టింది. ఎంత తీరుబడి లేదనుకుంటున్నానో అలాగే