పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అతడు ఒక పర్యాయం ఇలా అన్నాడు: "నే నిప్పుడు ఏ ఉక్కు కర్మాగారాన్ని చూసి భరించలేకపోతున్నాను. అక్కడికి వెళ్ళితే నాకు నాకంటె ముందు వెళ్ళిపోయిన వ్యక్తు లెందరో జ్ఞప్తికి వస్తారు."

అందుచేత వెనుకటివలె ప్రగాఢప్రేమతో నాహస్తాన్ని బంధించగల నా తొలినాటి మిత్రులు కొద్దిమంది మాత్రమే నాకు అక్కడ మిగిలి లభిస్తారు. 'ఆండీ' అని నన్ను పిలిచేవృద్ధులు ఒకరో ఇద్దరో మాత్రమే అక్కడ వుంటారు.'