పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మిత్రుడు అయిన రిచ్చర్డు వాట్సిన్ గిల్డర్ ఒకమారు కార్నెగీ గురించి ఇలా వ్రాశాడు: "ఎ. సి. అనంతమైన సామర్థ్యం, అద్భుతమయిన భావనాబలం గలవాడు. అతని భావాలన్నీ అతి విశాలములైనవి. అంతేకాదు, భవిష్యదర్థ సూచకములు. నేను ఇచ్చే అభిప్రాయం పొరబాటైంది కాకపోతే అతడికి కళంకరహితమయిన నైతికశీల మున్నది. అతడు పరిపూర్ణుడు కాకపోవచ్చును. కానీ అతడు మన అభిలాషను చూరగొన్న గలవాడు. విశిష్టత గలవాడు. సత్యమైన ప్రజాస్వామిక పౌరుడు. అతని లోకోపకారకృత్యాలన్నిటికీ మూలం ఉత్తమ సిద్ధాంతాలు, శీలము, అన్న గుణాలు రెంటిలో కన్పిస్తుంది. అతడే మరొక సందర్భంలో వ్రాస్తూ "ఎ. సి. నిజంగా ఒక మహావ్యక్తి, రసాత్ముడు, పట్టుదల గలవాడు, దయాళువు. అనేక విషయాల మీద బుద్ధిని ప్రసరింప చేసేవాడు. కొన్ని సందర్భాలల్లో ఇతడు తన అభిప్రాయాన్ని రుద్దటానికి యత్నిస్తుంటాడు. ఆ సమయాలల్లో ఇతడు దరిదాపు క్రూరుడుగా వర్తిస్తుంటాడు. మల్లా కోమలహృదయం లేకపో లేదు. నిండు ప్రేమ గలవాడు ఉద్వేగి నిరంతర భావుకుడు. అసాధరణ విశాల దృక్పధం, అభిప్రాయాలూ గలవాడితడు. జీవిత చరిత్ర వ్రాయదగ్గవాడు. 'నీకు నీవే బాస్వెలువు కమ్మ'ని (జీవిత కథాకారుడు) నేను ప్రబోధిస్తున్నాను అతడిలోఅన్నివిషయాలల్లోను పరస్పర వ్యతిరేకత గోచరిస్తుంది. అయితే ఇది మహోన్నత విషయాలమీది అత్యంత ప్రీతివల్ల కలుగుతున్నది. మానవ సౌభ్రాత్రం, వివిధ జాతుల మధ్య శాంతి మత విషయకమైన పవిత్రత..."