పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

న్నాడు. అతని ప్రసంగం పూర్తి అయిన తరువాత అతని వంకకు వ్రేలునాడిస్తూ "నేను చెయ్య ననుకో, కాని నేను టైలర్ హాల్ అని పేరు పెట్టవలసిందే నని పట్టు పట్టితే అప్పుడు నీవు పరిహాసపాత్రుడివికావా? అయితే నీవు లేహై కోసం అట్టి ఆత్మత్యాగాన్ని చెయ్యటానికి అంగీకరించటానికి సిద్దపడవలసిందే! అది నీ విద్యామాతకు తోడ్పడుతున్నది. ఆ సందర్భంలో నిన్ను ఏదోగర్వం ఆవరించకపోయి నట్లయితే నీ పేరును ఎవరు ఎలా ఉపయోగించుకొన్నా నీవు పట్టించు కుండేవాడివి కావు. టైలర్ అన్న పేరులో ఏముంది యిక్కడ యిబ్బంది పెడుతున్న దల్లా నీ తాళలేని ఆత్మగర్వం. నీవు దాన్ని జయించి తీరాలి_"

"యజమానీ! ఇక ఆపండి యిలా వెర్రినిచేయటం అన్నాడు టైలర్ జేవురించిన మోముతో "విషయాన్ని పెడత్రోవ పట్టిస్తున్నారు. ఇది మీకు తెలుసు"

"సరే మంచిది. నీ వొక నిర్ణయానికి రా" చేయి ఊచుతూ అన్నాడు కార్నెగి. టైలర్ అన్న పేరును విడచి పెడతావో, లెహైని విడిచిపెడతావో నీ యిష్టం వచ్చింది చెయ్యి. కానీ టైలర్ లేకపోతే హాలు లేదు - చార్లీ ఇది నీ తుది నిర్ణయం."

టైలర్ చివరకు లొంగిపోయినట్లు చేతులెత్తాడు.

కార్నెగి ఇలా వ్రాశాడు. "తరువాత రోజుల్లో ఆ నిర్మాణాన్ని చూచి టలర్ ఎవరిని ఆశ్చర్యపడ్డారు. అతడు లెహైకి భక్తితత్పరతగల పుత్రుడని, సోదరమానవ సేవను