పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/223

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


"మిష్టర్ కార్నెగీ. ఈ పేరు వద్దు. ఆ భవనాన్ని నేను ఇవ్వటం లేదు. అదీకాక నేను ప్రసిద్ధి పొందిన ప్రముఖుడనుకాదు కేవలం ఈవిద్యాలయంలో విద్యార్థిని మాత్రమే. ఇంతటి గౌరవాన్ని పొందటానికి నేను చేసిందేమీ లేదు," అని అతడు అభ్యంతరం చెప్పాడు.

"ఈ భావాన్ని నాకు కల్పించినవాడివి నువ్వు" అని కార్నెగీ అడ్డుపడి అన్నాడు. నీవు నన్ను ఆ భవనానికి డబ్బు యిచ్చేదాకా నా వెంటబడి నేను సగం చచ్చేటంతగా పీడించావు. సెంటు అయినా పుచ్చుకోకుండా నాకు ప్రియమైన మూడు పథకాలకు ఆధిపత్యం వహించి నైలర్ లా (మేకులు చేసేవాడు) పనిచేస్తున్నావు. ఇంతకుమించి నేను నీకు ఏమీ చెయ్య లేదు."

"అటువంటి చిన్నపనులకు ప్రతిఫలం పుచ్చుకుండే వాణ్ణి కా"నని టైలర్ మీరు ఇటువంటి సంస్థలకు లక్షలాది ధనమిచ్చారు నేను దీనికోసం కొద్ది గంటల కాలాన్ని వినియోగించగలను. ఇది అదికాదు. ఆ భవనానికి నామరూపాలు లేని నాపేరు పెట్టటం, అన్న భావం. దానికి గాను నేను ఏమీ ఇవ్వలేదని అందరికీ తెలుస్తుంది. అప్పుడు నేను పరిహాసపాత్రుడ నౌతాను. క్రొత్తవాళ్ళెవరైనా ద్వారంమీద ఆ పేరు చూస్తే "ఈ టైలర్ వర్తమానకాలం వాడా, భూతకాలం వాడా అని అడగరా?

జేబుల్లో చేతులు పెట్టుకొని కార్నెగి వేడితగ్గి మాటలై పోయేటంతవరకూ వెనక్కువ్రాలి కుర్చీనానుకొని కూర్చు