పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/213

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వారి కుటుంబాలతో వచ్చి ఒక వారం రోజులు గడిపిపోవలసిందని ఆహ్వానించారు. యూనివర్శిటీ ట్రస్టుకు అధ్యక్షుడయిన ఎరల్ ఆఫ్ ఎల్జిన్, బ్రిటిష్ మంత్రివర్గంలో స్కాట్లండు తరపున కార్యదర్శి అయిన లార్డు బాల్ఫోర్ కూడా వారు వచ్చినపుడు విచ్చేశారు. తరువాత తరువాత ప్రిన్సుపాల్స్ వీక్‌' అన్నది స్కిబోలో ప్రతిసంవత్సరం జరిగే ఒక వుత్సవమయింది. అది ఎప్పుడూ ఒక సంతోషకరమైన సమయంగా వుంటుండేది.

మొదట ప్రిన్సిపాల్స్ వీక్ అయిన తరువాత ప్రిన్సిపాల్ లాంగ్ వెల్లెటప్పుడు కార్నెగీతో కరచాలనం చేస్తూ "స్క్వాబు విశ్వవిద్యాలయ ప్రిన్సిపాల్‌కు ఏలా మా సమావేశాలను ప్రారంభించుకోవాలో తెలుసుకోటానికి అయిదు వందల సంవత్సరాలు పట్టింది. ఇందుకు అందరూ ఒక వారాన్ని కలసి గడపటమే పరిష్కారం" అన్నాడు.

తా నిప్పుడు సంపూర్ణ స్వేచ్చ కలవాడు కనుక విశ్రాంతిని పుచ్చుకొన్న ఆ పారిశ్రామికుడు తను చేయ దలచుకొన్నది ఎంత వుందో గమనించి మనోహరమైన ఆశ్చర్యాన్ని పొందాడు. అమెరికన్ బ్రిటిష్ పత్రికలకు తాను వ్రాసిన వ్యాసాలు కొన్నింటిని సమకూర్చుకొని, మరికొన్ని అదనపు విషయాలను చేర్చి 1901 లో "ది ఎంపైర్ ఆఫ్ బిజినెస్" అన్న పేరుతో ఒక సంపుటిని ప్రచురించటం ఈ చేయదలచిన పనులలో ఒకటి. అతడు జేమ్స్‌వాట్ జీవిత చరిత్ర వ్రాయటమనే అభిలాషతో ఉర్రూతలూగుచున్నాడు. ఫిపు ఎవెన్యూకు రెండు మైళ్ళకు పైన నైన్‌టీన్‌త్ నైన్‌టీఫస్టు