పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కూడా ఈ రెక్తర్ పదవికి ఎన్నుకొన్నప్పుడు అతడు ఇంకా విశేషంగా గర్వించాడు.

రెక్టర్స్ నైట్స్‌లో అతడు ఎంతో సంతోషించాడు. వీటిలో రెక్టర్ సంపూర్ణంగా విద్యార్థులతో కలిసి మెలసి చలిస్తాడు. ఎంతో ఆదాన ప్రదానం జరుగుతుంది. వీటిలో ఉండటానికి అధ్యాపక వర్గంలో ఒకడికయినా అనుమతి దొరకదు. మొదటి రెక్టర్స్‌నైట్ గడచిన తరువాత ప్రిన్సిపాల్ డొనాల్డ్‌సన్ "భలాన రెక్టరు మాకు ప్రతిగా మాటాడాడు. మరొక రెక్టర్ మాకు అనుకూలంగా మాటాడాడు. వారిద్దరూ వేదికనుంచే మాటాడారు. రెక్టరు కార్నెగీ చక్రాకారంగా వున్న మా మధ్య కూర్చుని మాతో మాట్లాడాడు." అని విద్యార్థులు చెప్పుకొన్నట్లు అతనికి తెలియ జేశాడు. సెయింట్ ఆండ్రూస్‌లో దరిదాపు రెండువందల మంది విద్యార్థులే వుండటంవల్ల యిలా చేయటం ఏ మంత కష్టమయిన పని కాదు.

ఆబర్ డిస్, ఎడింబరో, గ్లాసో, సెయిండ్ మాధ్చూన్ అన్న నాలుగు విశ్వ విద్యాలయాలు ఆర్థికంగా స్తోమతతప్పి వున్నదని శక్తివుండికూడా విశ్వవిద్యాలయవిద్యను అనేక మంది బాలురు పొందలేకపోతున్నారనీ గమనించి కార్నెగీ 1,00,00,000 (కోటి) డాలర్‌లు నిధితో స్కాచ్ యూనిర్శిటీ ట్రస్టును ఏర్పాటు చేశాడు. ఇందులో సగభాగం పై నాలుగు సంస్థల ఉపయోగంకోసం మిగిలిన సగభాగంవిద్యార్జనను ఆశించే యువకులకు సహాయం చెయ్యటం కోసము వుద్దేసింపబడ్డాయి. విశ్వవిద్యాలయ ప్రధానాచార్యులను,