పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/21

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆవిరిమీద నడిచే మర మగ్గాలున్న కర్మాగారాలు ఆక్రమిస్తున్నాయని ఆండ్రా అతి బాల్యంలోనే గమనించాడు. చేనేతపనివారి ఆందోళని అతితీవ్రం కాజొచ్చింది. కొందరు జిల్లాలో మధ్యగా వేస్తున్న క్రొత్త రైలుమార్గంమీద పనిచేయటంకోసం పలుగు పార పుచ్చుకుని వెళ్లవలసివచ్చింది. కొందరు బొగ్గు గనుల్లో పనిచేయటానికి వెళ్లారు. మార్గరేట్ కార్నెగీకి సన్నిహిత కుటుంబంలోనివారు ముగ్గురు - సోదరుడు విలియం మారిసన్, ఇద్దరు సోదరీమణులు మిసెస్ థామ్సన్ హోగన్, మిసెస్ ఆండ్రూ ఐట్కిన్‌లు వారి భర్తలతో - అమెరికాదేశానికి వలసపోయినారు. లోకజ్ఞానం తక్కువయిన లిల్లీ కార్నెగీ, ఎంతగా సన్నగిల్లిపోతున్నా ఇంకా ఆశను చంపుకోలేక తన పాత వ్యాపారాన్ని, పాత దేశాన్ని అంటిపెట్టుకుని అలాగే వుండిపోయాడు. అయితే ఒకరోజున దీనవదనంతో ఇంటికి తిరిగివచ్చి తన నేతపనివాళ్ళలో ఒకడితో ఇలా అన్నాడు. "తమ్మాస్! నిన్ను పంపించి వేయవలసి వచ్చేటట్టుంది. పని చాలా తరిగిపోయింది" త్వరలోనే తన నేత పనివాళ్ళలో మరొకణ్ని, మరొకణ్నీ వరుసగా పంపించిచేయటం జరిగింది. విలియం ఒక్కడే చివరకు మిగిలాడు. మంచి విలువైనదిగా భావింపబడుతూ వచ్చిన ఇరవై పౌనుల ఖరీదుమగ్గాన్ని అమ్మవలసి వచ్చింది. కానీ దానివల్ల అతడికి లభించింది కొద్ది షిల్లింగులు మాత్రమే.

జీవిత వ్యయంకోసం మగ్గాలలో రెండోది మూడోది కూడా వెళ్ళిపోవటం తప్ప లేదు. కుటుంబం ఒక చౌక కుటీరంలోకి చేరింది. అందులోనే మిసెస్ కార్నెగీ చిన్న దుకాణం