పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గితే అది దరిదాపుగా ఇవ్వటానికి సంసిద్ధుడయినాడు" అన్నాడు స్క్వాబ్.

"కావచ్చు. నాకు డబ్బుతో పని లేదు. వ్యాపారం నుంచి బయటకు వెళ్ళి నేను చేసే దేముంది?" అన్నాడు కార్నెగీ అడ్డు చెబుతూ.

"డబ్బును దానంచేస్తూ మహానందాన్ని అనుభవించ వచ్చు. మీ ఐశ్వర్య సువార్తను నిరూపించి చూపవచ్చు."ఇలా అతడు యజమాని నిశ్శబ్దంగా వింటూంటే వాక్య పరంపరను క్రుమ్మరించాడు.

చివరకు కార్నెగీ అడిగాడు. "దీన్ని గురించి ఇతర భాగస్థుల అభిప్రాయ మేమిటి? మరి, వాళ్ళతో నీవు సంప్రదించావా?"

"మేము ముగ్గురమో, నలుగురమో ఒకరితో ఒకరు ఏదో చెప్పుకున్నాము" అని స్క్వాబ్ ఒప్పుకున్నాడు. "అయితే వాళ్ళంత అంగీకరిస్తారని నా నిశ్చయం. మాలో ఉక్కు వ్యాపారంలో వుండిపోదలచుకొన్న వాళ్ళెవరయినా వుంటే మోర్గస్ రూపొందిస్తున్న ఆ యునైటెడ్ స్టేట్స్ స్టీల్ కార్పొరేషన్‌లో స్టాకును, బాండ్లను పుచ్చుకొంటాము. మీరు వెంటనే డబ్బు రూపంలోకి మార్చుకొనేందుకు గాని దాన ధర్మాల కుపయోగించుకొనేందుకు గాని అనువైన బాండ్లనే తీసుకోవచ్చు."

మధ్యాహ్నామైంది. వాళ్లు కొద్దిసేపటికి విడిపోబోయే టంతవరకూ కార్నెగీ ఇంకా కొంత మాట్లాడాడు. "ఇతర