పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/206

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


విడిచిపెట్టమనే భావాన్ని ఆయన అసహ్యించుకొంటుంటాడు" అన్నది.

కొంతసేపు వాళ్ళిద్దరూ దాన్ని గురించి చర్చించుకొన్నారు. "ఆయనను ఏ గోల్ఫ్ ఆటకొ తీసుకుపోయి అక్కడ ఉల్లాసంగా వున్నప్పుడు ఈ విషయాన్ని నీ వెందుకు సూచించగూడదు?" అన్న దామె. చిరు నవ్వుతో ఇంకా యిలా అన్నది. "ఈ భావాన్ని ఆయనకు నచ్చ జెప్ప గలవా డెవడయినా ఉన్నాడంటే, ఛార్లీ అది నీ వొక్కడవే" అన్నది.

అందువల్ల చార్లీస్ స్క్వాబ్ తనయజమానిని వెష్ట్ ఛెష్టర్ కౌంటీలోని గోల్ఫ్ క్లబ్‌కు తీసుకు పోయినాడు. యిద్దరూ అక్కడ ఒక పచ్చిక బీడులు మీదుగా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ నడుస్తున్నప్పుడు స్క్వాబ్ విషయాన్ని ఎత్తుకున్నాడు. మొదట అతడు ఏమాత్రం సుముఖుడుగా లేడు. "కాదు. కాదు. విరమించుకోటం నాకు యిష్టం లేదు" అని కళవళ పడుతూ అన్నాడు. ఆ తత్తర పాటు అతడు మనసులో ఒక అంతర్యుద్ధాన్ని సాగిస్తున్నట్లు వెల్లడి చేస్తున్నది. ఇప్పుడు ఆయనను ముట్టడించినవాడు చరిత్రలోకల్లా ప్రసిద్ధుడయిన సేల్స్‌మన్ అని సమకాలికుల చేత అనిపించుకొన్న వ్యక్తి. అతని అందానికి తరిమి ఒప్పించే నేర్పుకు దరిదాపుగా తట్టుకో గలగడం అంటూ వుండదు.

"వ్యాపారంలో పెట్టేందుకు మోర్గన్‌కు వందలకొద్ది మిలియన్లున్నాయి. అతడు మనకు చాలా క్లెశకరమయిన ప్రతిద్వంది అయితీరుతాడు. అంతే కాదు అతడు మీరే మడి