పుట:Aandruu kaarnegii, Telugu (1955).pdf/205

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కర్మాగారాన్ని నిర్మించి దానికి ఎదురుదెబ్బ తీసింది. మిస్సాబి ఇనుప ఖజానాన్ని ఈ క్రొత్త కర్మాగారానికి సూటిగా పడవలమీద చేర్చటానికి వీలుంది.

మోర్గన్ యిప్పుడు కార్నెగీని కొనివెయ్య గలమా అని అబ్బురపడటం ప్రారంభించాడు. ఇతడు జాన్ డబ్లియు, గేట్సు దగ్గరనుంచి బార్బుడువైరు, ఉక్కు వ్యాపారాలను కొన్నాడు. అతడు మోర్గన్‌తో యిలా చెప్పాడు. "కార్నెగీ దగ్గిర పలుకుబడి గలవ్యక్తి ఒక్కడే వున్నాడు. అతడు ఛార్లీ స్క్వాబ్. అతణ్ని పట్టగలిగితే మీపని జరుగుతుంది."

మోర్గన్ స్క్వాబ్ ను, ప్రముఖులయిన యితర ఉక్కు వ్యాపరస్థులను సిమాలోచనల కోసం ఆహ్వానించాడు. ఒక రాత్రంతా మరపుకు రాని సమావేశమం జరిగింది."

స్క్వాబ్ వారితో "వ్యాపారిక బాధ్యతవల్ల ఆయన అలసిపోతున్నాడు. అయినా ఉక్కుతో వున్న సమస్త సంబంధాన్ని వదలుకోటానికి ఆయన యిష్టపడడు." అన్నాడు. ధరలను గురించి కర్మాగారాల మూల్యాలను గురించి కొన్ని గంటల చర్చలు సాగిన తరువాత స్క్వాబ్ "ఈ విషయంలో నేను చేయగలిగింది చేస్తాను." అని వాగ్దానం చేశాడు.

అతడు ఎంతో తెలివిగా మొదట మిసెస్ కార్నెగీని కలుసుకున్నాడు.

"ఆయన యిక విరమించుకో వాలి" అని ఆమె అంగీకరించింది. ఈ భావం అప్పు డప్పుడూ ఆయన మనస్సుకు రావటం నాకు తెలుసు. అయినా దానినుంచి పూర్తిగా